మా ఆయన బాగున్నాడు

సౌత్‌ ఇండియా స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నంకు గుండె పోటు వచ్చిందని, ప్రస్తుతం ఆయన ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి.దాంతో ఒక్కసారిగా మణిరత్నం అభిమానులు షాక్‌ అయ్యారు.

 Suhasini Maniratnam On Her Husband Health-TeluguStop.com

తమ అభిమాన దర్శకుడి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.తమిళ మీడియాలో మణరత్నం ఆరోగ్యంపై కథనాలు రావడంతో ఇతర రాష్ట్రాల్లో కూడా మీడియా ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేసింది.

అయితే ఆ వార్తలు ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ తేల్చి చెప్పింది సుహాసిని.

తన భర్త మణిరత్నం ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ఆయన ప్రస్తుతం ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉన్నాడంటూ సుహాసిని ట్విట్టర్‌లో ఒక ఫొటోను పోస్ట్‌ చేసింది.

సుహాసిని పోస్ట్‌తో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.ఇలాంటి వార్తలను పుట్టించవద్దంటూ మణిరత్నం అభిమానులు మరియు సన్నిహితులు మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నారు.

చిన్న సమస్యకు హాస్పిటల్‌కు వెళ్తే ఏకంగా హార్ట్‌ ఎటాక్‌ అంటూ వార్తలు ప్రసారం చేయడం ఏంటని సుహాసిని మీడియా వారిని ప్రశ్నిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube