తెలంగాణ ముఖ్యమంత్రి ఏదైనా హామీ ఇచ్చారంటే అది ప్రపంచంలోనే అతి గొప్పదై ఉంటుంది.సాధారణంగా ఆయన ప్రపంచంలో ఎవ్వరూ చేయని పనులు చేస్తుంటారు.‘ప్రపంచమంతా అబ్బురపడేలా’, ‘ప్రపంచంలో ఎవ్వరూ చేయనివిధంగా’…ఇలాంటి పదాలు ఎక్కువ వాడుతుంటారు.హైదరాబాదును ఫలానా నగరంలా చేస్తానని, తెలంగాణను ఫలాన దేశంలా మారుస్తానని అంటూ ఉంటారు.
ఇవ్వన్నీ ఆయన ఊత పదాలు.తాజాగా ఆయన ప్రపంచంలోనే అతి గొప్పదైన హామీ ఇచ్చారు.
ప్రస్తుతం టీఆర్‌ఎస్ శిక్షణ తరగతులు నాగార్జున సాగర్‌లో జరుగుతున్నాయి.మరి అక్కడ ఒక హామీ ఇవ్వాలి కదా.వెంటనే కేసీఆర్ ‘నాగార్జున సాగర్‌ను ప్రపంచంలోనే అతి గొప్ప పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నారు.దీన్ని కేవలం పర్యాటక కేంద్రంగానే కాకుండా బౌద్ధులకు పవిత్రమైన ప్రాంతంగా మారుస్తానన్నారు.
బౌద్ధ మతం నాగార్జున కొండతో ముడిపడి ఉంది కాబట్టి బౌద్ధ పర్యాటక కేంద్రంగా మారుస్తానన్నారు.ఇందుకోసం ప్రత్యేక అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తానన్నారు.మొత్తం మీద పని అయినా కాకపోయినా హామీలు మాత్రం ఘనంగా ఇస్తారు కేసీఆర్.మాటల మాంత్రికుడు కదా మరి….!
.






