రవాణా సమ్మెకు పాక్షిక స్పందన

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రోడ్డు భద్రత బిల్లుకు వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా జరిగిన ట్రాన్స్పోర్టు సమ్మెకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో పాక్షిక స్పందన లభించింది.

అంటే తెలుగు రాష్ర్టాల్లో సమ్మె అంతగా విజయవంతం కాలేదన్నమాట.

క్యాబ్స్, ట్రక్కులు, ఆటోరిక్షాల వారు మాత్రమే సమ్మెలో పాల్గొన్నారు.ఆర్‌టిసి బస్సులపై సమ్మె ప్రభావం లేదని అధికారులు తెలిపారు.

ఆర్‌టిసి సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొనకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తగ్గాయి.రోడ్డు భద్రత బిల్లు వాహనాల కార్మికులకు వ్యతిరేకంగా ఉందని చెబుతున్నారు.

ఈ బిల్లు చట్టమైతే ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారికి, రోడ్డు భద్రతను పట్టించుకోనివారికి భారీగా జరిమానాలు విధించే అవకాశముంది.అందుకే ప్రయివేటు వాహనాల కార్మకులు, యజమానులే అధికంగా సమ్మెలో పాల్గొన్నారు.

Advertisement

దాదాపు అన్ని ప్రధాన కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి.కార్మిక సంఘాలవారు అక్కడక్కడా బస్సులను అడ్డుకున్నారు.

మొత్తం మీద తెలుగు రాష్ర్టాల్లో ఈ సమ్మె ప్రభావం కనబడలేదు.చట్టాలు కఠినంగా ఉంటే మంచిదే.

కాని ఆ పేరుతో పోలీసులు, రవాణా అధికారులు తమను దోపిడీ చేస్తారని, ఏరోజుకారోజు సంపాదించుకునే తమకు ఆర్థికంగా కష్టాలు కలుగుతాయని కార్మికులు భయపడుతున్నారు.ట్రాఫిక్‌ నిబంధనలు మంచిగా పాటిస్తే ఎందుకు భయపడాలి? .

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు