‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
చేసిన సినిమాల్లో ఎక్కువ సక్సెస్‌లను దక్కించుకున్న రకుల్‌తో ప్రస్తుతం స్టార్ హీరోలు సినిమాలు చేయాలని పోటీ పడుతున్నారు.ఇప్పటికే ఈ అమ్మడు టాలీవుడ్ టాప్ హీరోలు అయిన రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో సినిమాలు చేస్తోంది.
త్వరలోనే మహేష్‌బాబుతో కూడా ఒక ప్రాజెక్ట్‌ను ఓకే చేసుకునే అవకాశాలున్నాయి.ఈ నేపథ్యంలో ఈమెకు యువ హీరో నితిన్‌తో నటించే అవకాశం కూడా వచ్చింది.
ప్రస్తుతం నటిస్తున్న చరణ్ సినిమాకు మరియు ఎన్టీఆర్ సినిమాకు 50 నుండి 60 లక్షల పారితోషికాన్ని మాత్రమే తీసుకున్న ఈ అమ్మడు నితిన్‌తో నటించేందుకు మాత్రం ఏకంగా కోటి రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న తాను చిన్న హీరో నటించాలంటే కాస్త ఎక్కువ పారితోషికమే కావాలని ఈమె అంటున్నట్లుగా తెలుస్తోంది.
రకుల్ డిమాండ్ చేసిన కోటికి నితిన్ తండ్రి నిర్మాత అయిన సుధాకర్ రెడ్డి ఓకే చెప్పాడని అంటున్నారు.ఇప్పటికే కోటికి ఓకే చెప్పి, అడ్వాన్స్‌ను కూడా ఇచ్చాడు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాను వచ్చే నెలలో ప్రారంభించే అవకాశాలున్నాయి.నితిన్ సినిమాతో రకుల్ కూడా కోటి క్లబ్‌లో చోటు సంపాదించింది.







