టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు కొత్త స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే హైదరాబాద్‌లో మరియు వైజాగ్‌లో రామానాయుడు స్టూడియోలను కలిగి ఉన్న సురేష్‌బాబు మరో కొత్త స్టూడియోను నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అయిన అమరావతిలో ప్రారంభించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
అందుకోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సురేష్‌బాబు పలు దఫాలుగా చర్చలు కూడా జరిపాడని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
రాష్ట్ర విభజన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైజాగ్‌కు వెళ్లిపోతుందని అంతా భావించారు.
అయితే హైదరాబాద్‌లోనే తెలుగు సినిమా ఉంటుందని, అయితే వైజాగ్‌తో పాటు ఏపీ కొత్త రాజధాని అయిన అమరావతిలో కూడా సినిమా స్టూడియోలు కొత్తవి పడే అవకాశాలున్నాయని మొదటి నుండే సినీ వర్గాల వారు చెబుతున్నారు.పరిస్థితుల ప్రభావంను బట్టి తెలుగు సినిమా ఎక్కడ ఉండేది భవిష్యత్తులో తేలిపోనుంది.
ఈ క్రమంలో అందరి కంటే ముందుగానే మేలుకోవాలనే ఉద్దేశ్యంతో సురేష్‌బాబు స్టూడియో నిర్మించాలని భావిస్తున్నాడు.సురేష్‌బాబుతో పాటు ఇంకా పలువురు కూడా స్టూడియోల నిర్మాణంకు ప్లాన్ చేస్తున్నారు.







