చెర్రీకి అప్పుడే కొట్టేశాడు

గత కొంత కాలంగా యంగ్‌ హీరోలు తమ సినిమాలకు సంగీత దర్శకుడిగా థమన్‌ను ప్రిపర్‌ చేస్తున్నారు.

కెరీర్‌ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే 50 సినిమాలను పూర్తి చేసిన థమన్‌ వరుస సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు.

రోజుల వ్యవధిలోనే ట్యూన్స్‌ ఇస్తాడని, ఇంత వేగంగా ఏ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా ఇవ్వడు అంటూ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో టాక్‌ ఉంది.ఈయన ఎంత స్పీడ్‌ అనే విషయం మరోసారి తేలిపోయింది.

రామ్‌చరణ్‌, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాకు మొదటగా అనిరుధ్‌ను సంగీత దర్శకుడు అనుకున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల ఆయన్ను తప్పించి, థమన్‌ను ఆ స్థానంలో తీసుకున్నారు.

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు థమన్‌ను ఎంపిక చేసినట్లుగా దర్శకుడు ప్రకటించాడు.అప్పుడే ఈ సినిమాకు అన్ని ట్యూన్స్‌ ఇచ్చాడట థమన్‌.

Advertisement

దర్శకుడు శ్రీనువైట్ల చెప్పిన ఆరు సన్నివేశాలకు తగ్గట్లుగా ఆరు ట్యూన్స్‌ను రెడీ చేశాడని, వాటికి చెర్రీ కూడా ఓకే చెప్పాడని టాక్‌ వినిపిస్తోంది.ఇంత త్వరగా మంచి ట్యూన్స్‌ను ఇచ్చినందుకు థమన్‌ను చెర్రీ అభినందించినట్లుగా కూడా తెలుస్తోంది.

ఇక బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ బ్యాలెన్స్‌ ఉంది.షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత థమన్‌ మిగిలిన పనులు పూర్తి చేయనున్నాడు.

ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందు ఏర్పాట్లు చేస్తున్నారు.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు