ఈయన కోసం 1500 థియేటర్లు

టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్‌ హీరోలు తమ సినిమా కలెక్షన్స్‌ను మొదటి వారం రోజుల్లోనే రాబట్టుకోవాలనే ఉద్దేశ్యంతో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

గతంలో మూడు నాలుగు వందల థియేటర్లలో సినిమా విడుదల అవుతుందంటే ముక్కున వేలేసుకునే వారు.

కాని ప్రస్తుత సమయంలో వేల సంఖ్య థియేటర్లలో సినిమాలను విడుదల చేసి, సాధ్యం అయినంత తొందరగా కలెక్షన్స్‌ను రాబట్టుకుంటున్నారు.అదే క్రమంలో తాజాగా ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ కూడా భారీ స్థాయిలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ‘జులాయి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా తర్వాత తెరకెక్కిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.ఆ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమాను దాదాపు 1500లకు పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ సినిమా అన్ని పట్టణాల్లోని థియేటర్లలో సందడి చేయడం మొదలు పెట్టింది.బన్నీ కెరీర్‌లో ఇంత భారీ స్థాయిలో విడుదల అవ్వడం ఇదే ప్రథమం.

Advertisement

సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఎంతో మంది ముఖ్య నటీ నటులు నటించారు.ఈ సినిమాలోని త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవ్వడం ఖాయం అని అంటున్నారు.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు