స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు త్వరలో భారీగా పారితోషకాలు పెంచడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కసరత్తు చేసింది .రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు ప్రతి పాదనలు తయారు చేసి ముఖ్యమంత్రి చంద్ర బాబు ముందు పెట్టింది .
పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ త్వరలో పారితోషికాలు పెంచనున్నాము .సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులకు పారితోషకాలు పెంచే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.అందులో కొన్నింటిని బాబు తగ్గించవచ్చు.కొన్నింటిని పెంచనూవచ్చు .జిల్లా పరిషత్ అధ్యక్షులకు ప్రస్తుతం నెలకు 7500 రూపాయల వేతనాన్ని ఏభై వేలకు పెంచే ఆలోచన వుంది.జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులకు 2250 రూ.లను ఆరు వేలకు, మండలా ధ్యక్షులకు ఇస్తున్న 1500 రూ.లను ఆరు వేలకు, ఎం పి టిసీలకు ఇస్తున్న 750 రూపాయలను ఇకపై మూడు వేలకు పెరచాలన్న ప్రతిపాదన తయారయ్యింది.అలాగే మైనర్ పంచాయతీల్లో సర్పంచులకు ఇస్తున్న వెయ్యి రూ.లను మూడు వేలకు, మేజర్ పంచాయతీల్లో ఇస్తున్న 1500 రూపాయల పారితోషకాన్ని మూడు వేలకు పెరచేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.పారి తోషకాలు పెరచడం వల్ల 659 మంది జెడ్‌పిటి సిలపై ఏటా రూ.4.74 కోట్లు, 659 మండలా ధ్యక్షులపై రూ.4.74 కోట్లు, 10,148 మంది ఎం పీటిసిలపై రూ.36.93 కోట్లు, 11,965 మంది మైనర్ పంచాయతీల పై రూ.43.87 కోట్లు, 953 మేజర్ పంచాయతీలకు రూ.3.43 కోట్ల చొప్పున పెరగనుంది .రాష్ట్రంలో చాలాకాలంగా పాత పారితోషకాల విధానాన్నే అమలు చేస్తున్నారు.ఇటీవల తెలంగాణ ప్రభు త్వం స్థానిక సంస్థల ప్రతినిధులకు పారితోషకాలు పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వమ్ లో కూడా కదలిక వచ్చింది .







