టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని విషయాలను కూడా ఎంతో రహస్యంగా జక్కన్న ఉంచుతూ వస్తున్నాడు.
కథ ఏంటి, ప్రభాస్ ఏ పాత్ర, ఇద్దరు హీరోయిన్స్ పాత్ర ఏంటి, రానా పాత్ర ఏంటి అనే విషయాలు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు.దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ సినిమా విషయాలు ఎంత తెలుసుకోవాలని ప్రయత్నించినా కూడా మీడియా వారికి కూడా అంతు చిక్కడం లేదు.
అయితే తాజాగా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాట ఉందనే విషయం బయటకు వచ్చింది.
‘టెంపర్’ బ్యూటీ నోరా ఫతేహి ‘బాహుబలి’ సినిమాలో ఒక పాటలో కనిపించనుందని తాజాగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.
ఈ అమ్మడు తాజాగా ఆ పాటకు సంబంధించిన మరికొన్ని విషయాలను కూడా తెలియజేసింది.ఆ పాటలో తనతో పాటు మరో ఇద్దరు మోడల్స్ కూడా ఉంటారని, భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు ఈ పాట చిత్రీకరణలో పాల్గొననున్నట్లుగా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.దాంతో జక్కన్న ఆమెపై ఫైర్ అవుతున్నాడట.
సినిమాకు సంబంధించిన ఏ విషయం అయినా ఎంతో రహస్యంగా ఉంచుతుండగా ప్రత్యేక పాట గురించి ఎందుకు చెప్పాలి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.మరోసారి ఇలాంటివి రిపీట్ కావద్దని హెచ్చరించాడట.







