టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాను మే మొదటి వారంలో విడుదల చేస్తామని దర్శకుడు కొరటాల శివ సినిమా ప్రారంభం అయిన సందర్బంగా చెప్పుకొచ్చాడు.గత కొన్ని నెలలుగా మే కోసం సూపర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాని తాజాగా ఈ సినిమాను మేలో విడుదల చేయలేక పోతున్నాం… జులై 17న ఈ సినిమాను విడుదల చేస్తాం అంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది.
‘మిర్చి’ తర్వాత భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు మరియు రాజేంద్ర ప్రసాద్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
యువ హీరో రాహుల్ రవీంద్రన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు.ఈ సినిమాలో మహేష్‌బాబు ప్లేబాయ్‌గా కనిపించనున్నాడని సినీ వర్గాల వారు అనధికారికంగా చెబుతున్నారు.
ఉగాది సందర్బంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి.ఈ సినిమా జులైకు వాయిదా పడటంతో సూపర్ ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించనున్నాడు.







