తెలుగు దేశం పుణ్యమా అని వైకాపా లేత జగన్మోహనరెడ్డికి రాజకీయాలు మొత్తం ఆకళింపు అయ్యాయి అనేది నూటికి నూరుపాళ్ళు నిజం .తండ్రి చనిపోయేటప్పుడు కేవలం ఒకటి అరా మాటలకే పరిమితం అయ్యారు జగన్.
అలాంటి జగన్ వైస్ ఓదార్పు లో నాలుగైదు మాటలకే పరిమితమై పొయారు.అలాంటి జగన్ను రాజకీయంగా తీర్చి దిద్దడం లో తెలుగుదేశం నేతలు వారికి తెలియకుండానే వసపోసి చాలా రాజకీయ మెలుకువలు నేర్పారు .కేవలం జగన్ కోసం కాంగ్రెస్ తో చేతులు కలిపేసి జగన్ పని పట్టాలనుకునారు.అవన్నీ జగన్ కు అన్నివిధాల మెలుకువలు ఒళ్లో కూర్బోబెట్టి నేర్పినట్టయ్యింది.
ఆనాడే పట్టించుకోకుండా వుంటే ఈపాటికి జగన్ రాజకీయం ఎలా ఉండేదో అని పలువురు రాజకీయవాదులు చెప్పుకుంటున్నారు .
చంద్రబాబు లోగడ ముఖ్యమంత్రిగా చాల కాలం పనిచేసారు.ఆయనకు సభ ఎలా నడుపుకు పోవాలో తెలిసినంతగా వేరెవ్వరికి తెలియదు అనే కంటే బాబు అందులో ఫస్టు ర్యాంకులో ఉంటారు .అలాంటి చంద్రబాబు తన సర్కారును కేవలం ఒక కొత్తపార్టీ వైకాపా తో వేగాలేనంతగా చికాకు పడడం రాజకీయ పరిశీలకులకు అయోమయానికి గురిచేస్తూనే ఉంది .ఇప్పుడు వెతికితే మరో 4ఏళ్ళవరకు ఎన్నికలే లేవు .ఆలాంటప్పుడు ఎందుకు ప్రతిపక్షానికి మాట్లాడనీయకుండా చేయడం,కావలసినంత సమయం ప్రతిపక్షానికి ఇచ్చేస్తే సర్కార్కు జరిగే నష్టమే లేదు అని రాజకీయ మేధావులు అనుకుంటున్నారు .తీరా ప్రతిపక్షం ఎత్తిచూపినదానికి మంత్రులు బదులు ఇచ్చేస్తే సరిపొయెది.ఈదానికి ప్రతిపక్షానికి సర్కారే ప్రజల్లో హీరోని చేస్తోంది అనే విమర్శలు రాను రాను పెరిగి పోతున్నాయి
.






