మెగా ఫ్యామిలీ నుండి ‘ముకుంద’ సినిమాతో తెరంగేట్రం చేసిన వరుణ్ తేజ్ తాజాగా క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
ఈ సినిమాకు ‘కంచె’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లుగా తెల్సిందే.ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభం అయ్యింది.
ఎలాంటి హడావుడి లేకుండా రామానాయుడు స్టూడియోలో వేసిన ఒక భారీ సెట్టింగ్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
స్వతంత్య్రంకు పూర్వం కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.
ఈ సినిమా కోసం రామానాయుడు స్టూడియోలో స్వతంత్య్రంకు పూర్వం పరిస్థితులతో భారీ బడ్జెట్‌తో ఒక విలేజ్ సెట్టింగ్‌ను వేశారు.సినిమాలో ఎక్కువ భాగం ఆ సెట్టింగ్‌లోనే చిత్రీకరించనున్నారు.
ఇక ఈ సినిమాలో రెండవ ప్రపంచ యుద్దంను కూడా చూపించనున్నారట.అందుకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో చేయనున్నారు.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సైనికుడిగా కనిపించనున్నట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.ఇక ఈ సినిమాను ఇదే సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే పట్టుదలతో దర్శకుడు క్రిష్ ఉన్నాడు.







