ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలకు చంద్రబాబు విపరీతంగా హామీలు దంచేసారు.అందులో ఏ ఒక్కటి ముట్టుకోవడానికి లేదన్నంతగా వేల కోట్లు ఖర్చుతో కూడినవే.
కనుక హామీల జోలికి పోకుండా ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితిలో చంద్రబాబు కేంద్ర సాయం కోసం కొన్ని నెలలు చూస్తూ కాలయాపన చేస్తూ మిగిలిపోయారు.కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేమన్నట్లుగానే మౌనం అయిపొయింది.
ప్రధాని నరేంద్ర మోడీ తమ పార్టి లేని చోట మేమెందుకు ప్రత్యేకత చూపాలి.పొత్తు ఎన్నికలతో సరి.కలకాలం పొత్తుగ వుండక్కర్లేదు అనేది మోడీ ఆలోచనగా ఉంది.పైగా, ఆయనకు పార్టీ సీనియర్లు బహు విధాలుగా నూరిపోసారు.
మన బిజెపి కి ఆంధ్రప్రదేశ్ లో నిలువనీడ లేకుండా ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారు ఎవరో కాదు ప్రాంతీయ పార్తీలె.కనుక వాటికి వాటి నేతలకు మనం ప్రోత్సహించారాదు.
మన బిజెపికి ఒకటి అరా సీట్లు వున్నాయి దానికి మనమెందుకు ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా గుర్తించాలి.చంద్రబాబు నిధులు లేక చేతులెత్తేసినట్లు చేయగలిగితే అప్పడు దాసోహం కేంద్రమా అని డిల్లి కి పరుగెత్తుకుని రావాలి.
అప్పుడు మనమేమి చెబితే బాబు వినితీరాల్సిందే .అప్పుడు తెలుగుదేశాన్ని మన బీజేపి లో కలిపేయమందాము.నాడు పిఆర్పీని చిరంజీవి కాంగ్రెస్ లో కలిపెసినట్లు నేడు తెలుగుదేశాన్ని బిజెపి లో కలిపేయ మందాం.ఎంచక్కా బిజెపి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవుతుంది.ఇలా బిజెపి సాదించగలిగితె ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూడడము నిమిషంలో పని.ఇది బిజెఫై ఆలోచన అని చెప్పుకుంటున్నారు .-యర్నాగుల సెటైర్స్
.






