'బాబు' పై 'బాబు' బ్యాండ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు.నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.

 Jagan Fired On Chandrababu-TeluguStop.com

అందరం కలిసికట్టుగా చంద్రబాబును ఇంటికి పంపిద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.నిన్న అనంతపురం జిల్లా పూడేరు సర్కిల్లో జరిగిన సభలో మాట్లాడుతూ…చంద్రబాబు అప్పుడు శానససభలో మాట్లాడినప్పుడు రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోలేదని అన్నారని ఆయన గుర్తు చేస్తూ తీరా తాను పరామర్శ యాత్రకు బయలుదేరుతున్నట్లు తెలియగానే ఒక్క అనంతపురం జిల్లాలోనే 26 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారని అన్నారు.

అప్పుడు చంద్రబాబుకు రైతన్నల ఆత్మహత్యలు గుర్తుకు రాలేదా అని జగన్ ప్రశ్నించారు.ప్రశ్నించేవారు వస్తున్నారంటే తప్ప చంద్రబాబుకు రైతు సమస్యలు పట్టవా అని అడిగారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత చంద్రబాబు వాటిని మరిచిపోయారని విమర్శించారు.అనంతపురం జిల్లా హంద్రీనీవా నీళ్లు రావడానికి తానే కారణమని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు.

అయితే దీనిపై తెలుగుదేశం నాయకుల వాదం మరోలా ఉంది.వాళ్ళు మాట్లాడుతూ.

మా నాయకుణ్ణి విమర్శించే ముందు ముందు యాత్రలో సరైన వారిని పరామర్శించాలని…అంతేకాని తమ పార్టీకు సపోర్ట్ గేయా ఉన్న వారికోసమే యాత్ర చేయడం సరికాదని.ముందు దాన్ని సరిచేసుకోమని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube