'వెంకన్న' వర్సిటీలో..'ప్రభువు' ప్రచారం

ప్రపంచం ఎంత ముందుకు పోతున్నప్పటికీ ప్రజల్లో పాతుకుపోయిన కుల, మత ద్వేషాలు మాత్రం మాయం అవడంలేదు.అసలు విషయానికి వస్తే.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో అన్యమత ప్రచారం జరుగుతోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని ప్రిన్సిపల్ క్రిష్టోఫర్ దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఇటీవల అన్యమత ప్రచార గ్రంథాలు లభ్యమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వేసిన కవులు, రచయితలు, నేతల పెయింటింగ్స్ పైన శిలువ గుర్తులు ఉన్నాయని విద్యార్థుల సంఘాలు వెల్లడించాయి.

ఈ విషయమై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.ప్రిన్సిపల్ క్రిష్టోఫర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు.

Advertisement

క్రిష్టోఫర్ మద్దతుతోనే అన్యమత ప్రచారం జరుగుతోందని విమర్శించారు.కవులు, రచయితల పైన శిలువ పెయింటింగ్స్ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు.

వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.ఓ అన్యమతస్తుడిని ఇక్కడి విశ్వవిద్యాలయంలో ఎందుకు ఉంచారో చెప్పాలని విద్యార్థులు ప్రశ్నించారు.

అయితే దీనిపై విచారణ జరిపించి తప్పు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటాం అని కాలేజీ మ్యానెజ్‌మెంట్ చెబుతుంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు