అక్కినేని అఖిల్ మూవీ నేడు గ్రాండ్‌గా ప్రారంభం అయిన విషయం తెల్సిందే.నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మాస్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అఖిల్‌కు తండ్రిగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించనున్నట్లుగా తెలుస్తోంది.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టు అనగానే ఎక్కువగా వినిపిస్తున్న పేరు రాజేంద్ర ప్రసాద్.
స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా నటిస్తు వస్తున్న ఈ నిన్నటి తరం హీరోకు తాజాగా అక్కినేని మూవీలో మంచి పాత్ర లభించిందని సినీ వర్గాల వారు అంటున్నారు.రాజేంద్ర ప్రసాద్ సరిగా సరిపోయే ఈ పాత్ర మరెవ్వరు వేసినా కూడా మెప్పించలేరు అనే ఉద్దేశ్యంతో ఈయన్నే ఎంపిక చేసినట్లుగా వినాయక్ సన్నిహితులు చెబుతున్నారు.
ఈ సినిమాలో సాయేశా సైగల్ హీరోయిన్‌గా నటిస్తోంది.







