'టీ'ఎంప్లాయీస్ కు తీపి కబురు!!!

ఎన్నో విమర్శల వెల్లువతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కేసీఆర్ తెలంగాణా రాష్ట్ర ప్రజలను ఆకర్షించుకునే దశలో అనేక చర్యలు చేపడుతున్నారు.విషయం ఏమిటంటే.

తెలంగాణా ఎంప్లాయీస్ కు ఆయన సూపర్ ఆఫర్ ప్రకటించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటి సారిగా ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించింది.

ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించగా గతంలో ఇది 39 శాతం ఉండేది ఇప్పుడు 4 శాతం పెంచి 43 శాతంగా ప్రకటించారు.ఈమేరకు ఇవాళ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రకటించిన ఫిట్‌మెంట్ 2014 జూన్ 2 నుంచి అమలవుతుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం జూన్ 2న వచ్చినందున ఆ రోజు నుంచి అమలు చేయాలని నిర్ణయించామన్నారు.ఇందుకు సంబంధించి ఉత్వర్వులు త్వరలోనే జారీ చేస్తామన్నారు.

Advertisement

పీఆర్సీ సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువగా జీతాలు పెంచామని తెలిపారు.పెరిగిన జీతాలు మార్చి నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

బకాయిలను జీపీఎఫ్‌లో జమచేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు సకల జనుల సమ్మెతో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో త్యాగం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరవలేనిదని శ్లాఘించారు.రాష్ట్ర సాధనలో ఉద్యోగులు అగ్రభాగాన నిలిచారని పొగిడారు.

కేసులు పెట్టినా భయపడకుండా సకల జనుల సమ్మెలో పాల్గొన్నారని గుర్తు చేశారు.దాని కోసం ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు సాధ్యమైనంత వరకు సమకూరేలా చూస్తామన్నారు.కాగా జీతాల పెంపు వల్ల ఖజానాపై ప్రతి సంవత్సరానికి రూ.6500 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు.అయితే ఈ అదనపు భారాన్ని భరించే శక్తి ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

ఏది ఏమైనా ఒక్క దెబ్బతో కార్మిక శక్తిని కేసీఆర్ తన కొంగున కట్టేసుకున్నాడు అంటున్నాయి రాజకీయ వర్గాలు.

Advertisement

తాజా వార్తలు