ముందే కూసిన గులాబీ కోకిల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన పరంగానే కాకుండా పార్టీ అధ్యక్షుడిగా కూడా తన మార్క్‌ చూపుతున్నాడు.ఇప్పటికే ఇతర పార్టీల నుండి భారీగా వలసలను ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌ తాజాగా పార్టీ ప్రధాన కార్యలయం అయిన తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో చర్చలు జరిపారు.

 Kcr On 2019 Elections-TeluguStop.com

ఈ భేటీలో కేసీఆర్‌ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.పార్టీ సభ్యుత్వ నమోదుతో పాటు ప్రజల్లోకి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను తీసుకు వెళ్లే భాద్యతను కార్యకర్తలకు అప్పగించాలని కేసీఆర్‌ నిర్ణయించాడు.

ఇక ఇప్పటి నుండే 2019 ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాడు.గత ఎన్నికల్లో సెంటిమెంట్‌తో గెలిచినా కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులువుగా పార్టీని వరించదని పార్టీ నేతలకు సీరియస్‌గా చెప్పాడు.2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుండే కష్టపడటం తప్పని సరి అని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తేనే పార్టీ మనుగడ సాధ్యం అంటూ నాయకులకు హిత బోద చేశాడు.పార్టీ అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరిపేందుకు కూడా చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి ఇప్పటి నుండే కేసీఆర్‌ 2019 ఎన్నికల గురించి ఆలోచిస్తూ చాలా అడ్వాన్స్‌గా ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube