‘ముకుంద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ప్రేక్షకులతో పర్వాలేదు అనిపించుకున్నాడు.‘ముకుంద’ సినిమా తర్వాత వరుణ్ తన రెండవ సినిమాపై దృష్టి పెట్టాడు.
ఇప్పటికే ఈ మెగా హీరోతో సినిమా చేసేందుకు ఇద్దరు సిద్దంగా ఉన్నారు.వరుణ్‌తేజ్‌కు ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు క్రిష్‌లు కథలు వినిపించడం జరిగింది.
ఆ రెండు కథలను కూడా వరుణ్ ఓకే చేయడం జరిగింది.అయితే ఆ ఇద్దరి దర్శకుల్లో ఏ దర్శకుడితో వరుణ్ సినిమా చేయబోతున్నాడు అనే విషయంలో క్లారిటీ లేదు.
కాని ఏ నిర్మాణ సంస్థలో సినిమా చేయాలనేది మాత్రం డిసైడ్ అయ్యింది.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్‌ల రెండవ సినిమాలు మెగా ప్రొడక్షన్ హౌస్ అయిన గీతా ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కాయి.
వీరి ముగ్గురు కూడా తమ రెండవ సినిమాలను గీతా ఆర్ట్స్‌లో చేసి సక్సెస్‌ను దక్కించుకున్నారు.దాంతో అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తన తర్వాత సినిమాను గీతాఆర్ట్స్ బ్యానర్‌లో చేయబోతున్నాడు.
అతి త్వరలో దర్శకుడిని ఫైనల్ చేసే అవకాశాలున్నాయి.ఈ ఇద్దరి దర్శకులతో వరుణ్ చేయబోతున్న రెండు సినిమాలు కూడా ఇదే సంవత్సరం విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.







