రికార్డులు సృస్టించేది ఎవరో!!!

2014కు టాటా చెబుతూ 2015లోకి అడుగుపెట్టేశాం.అయితే ఈ 2015 సినీ పరిశ్రమకి కీలక సంవత్సరంగా మారబోతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

 Who Will Create Records??-TeluguStop.com

ఎందుకంటే వరుసగా బడా హీరోల సినిమాలు విడుదలకు సిద్దం అవుతూ ఉండడం… మరో పక్క అన్నీ దగ్గర దగ్గర తేదీల్లో విడుదలవుతూ ఉండడం చేత ఏ సినిమా హిట్ కొడుతుందో, ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడుతుందో అని తెలీక హీరోల అభిమానులు అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు.ఇక ఈ సినిమాల్లో ఒకటి రాజమౌళి బాహుబలి కాగా, పవన్ కల్యాణ్ గోపాల-గోపాల, ఎన్టీఆర్ టెంపర్, ఇక బాలయ్య లయన్ ఇలా బడా సినిమాలు బాక్స్ ఆఫీస్ ని హిట్ కొట్టడానికి సిద్దమవుతున్నాయి.

ఇంతవరకూ ఎలా ఉన్నా అందరి అంచనాలు బాహుబలి పైనే ఉన్నాయి.ఎందుకంటే ఫేల్యూర్ తెలియని దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం, అంతేకాకుండా భారీ విడుదలకు ప్లాన్ చేస్తూ ఉండడంతో అందరూ మిగిలిన సినిమాలా పరిస్థితి ఏంటో అని ఆలోచనలో పడ్డారు.

అయితే అందరూ బడా హీరోలు కావడం తమ తమ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల ఒక సినిమాపై మరో సినిమా ప్రభావం ఉండదేమో అని విశ్లేషకుల వాదన.మరి చూద్దాం 2015 ఎవరికి ఎలా ఉండబోతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube