తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది.అయితే ప్రతీ మెగా హీరో తొలి సినిమా ముందు మెగా అభిమానుల పెద్దలు అందరు ఒకచోట చేరి మెగా హీరోల సినిమాలను ఎలా హిట్ చెయ్యాలో అన్న చర్చలు చేసుకుంటారు.
ఇక ఈ కార్యక్రమానికి టవర్ స్టార్ నాగ బాబు సైతం హాజరు అవుతూ మెగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటాడు.ఇక ఇప్పటి వరకూ మెగా హీరోల చర్చలకు హాజరైన నాగబాబు మరోమారు అభిమానులను ఒక దగ్గరకు చేర్చి తన కుమారుడి చిత్రాన్ని హిట్ చెయ్యవలసిందిగా కొరాడని సమాచారం.
ఇక మెగా అభిమానులు కూడా దీనికి సానుకూలంగా స్పందించి సినిమాకు తమ వంతు సహకారం అందించాలని ఫిక్స్ అయ్యారు.అయితే గతంలో కూడా అల్లు శిరీష్ తొలి సినిమాకు మద్దతు ప్రకటిస్తాం అంటూ చెప్పిన మెగా అభిమానులు ఆ సినిమా విడుదల రోజున ఎక్కడా కనిపించకపోవడంతో పాపం ఆ చిత్రం కాస్తా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
మరి ముకుందా సినిమాకైనా మెగా అభిమానుల హడావిడి కనిపిస్తుందో లేదో చూడాలి.ఏది ఏమైనా సినిమాలో పస ఉండాలే కానీ హీరోతో పని ఏముంది!!
.






