కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అయినా వెంకటస్వామి అలియాస్ కాకా నిన్న రాత్రి బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.చాలా రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న వెంకటస్వామి మరణం రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.85 సంవత్సరాల కాకా ఎన్నో పదవులు నిర్వహించారు.దళిత నేతగా కింది స్థాయి నుండి తన సొంత శక్తితో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన కాకా పీసీసీ ప్రెసిడెంట్‌గా కూడా కొంత కాలం విధులు నిర్వహించారు.
1929 అక్టోబర్ 5న జన్మించిన కాకాకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.కొడుకుల ఇప్పటికే రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నారు.
పెద్ద కొడుకు వివేక్ రాష్ట్ర మంత్రిగా, చిన్న కొడుకు వివేక్ ఎంపీగా పని చేశారు.శ్రామిక సంఘం నేతగా చాలా కాలం పని చేసిన కాకా, అప్పటి వరకు కార్మికులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలపై ఉద్యమాలు చేసి, వాటి పరిష్కారానికి మార్గం సుగమం చేశారు.
కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వహించి, కార్మికులకు అండగా నిలిచారు.కాకాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు, పీసీసీ చీప్ పొన్నాల లక్ష్మయ్య ఇంకా పలువురు రాజకీయమ మరియు పారిశ్రామిక రంగాల వారు ఘన నివాళి అర్పించారు.
నేడు మద్యాహ్నం పంజాగుట్ట స్మశానవాటిక వరకు కాకా అంతిమ యాత్ర నిర్వహించనున్నారు.







