పీకే సినిమా చిరు సినిమాకు కాపీ!

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా కూడా అమీర్‌ ఖాన్‌ నటించిన ‘పీకే’ సినిమా గురించిన చర్చ జరుగుతోంది.

ఈ సినిమా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది.

రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతూ గత రికార్డులను బ్రేక్‌ చేస్తోంది.ఇక ఈ సినిమాలో అమీర్‌ ఖాన్‌ నటన గురించి, అనుష్క శర్మ అందం మరియు అభినం గురించి తెగ ముచ్చటించుకుంటున్నారు.

అయితే ఈ చిత్రం తెలుగులో చిరంజీవి, శ్రీదేవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రంలా ఉందనే వాదన వినిపిస్తోంది.‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రంలో ఇంద్రలోకం నుండి శ్రీదేవి భూమి మీదకు వచ్చి ఉంగరం పోగొట్టుకుంటుంది.

ఆ ఉంగరం పోవడం వల్ల ఆమెకు ఇంద్రలోక ఎంట్రీ ఉండదు.దాంతో ఉంగరం వెదుకునే క్రమంలో ఈ సినిమా నడుస్తుంది.

Advertisement

ఇక పీకే విషయానికి వస్తే గ్రహాంతర వాసి అయిన పీకే భూమి మీదకు వచ్చిన సమయంలో తన ష్పేస్‌ షిప్‌ రిమోట్‌ను పోగొట్టుకుంటాడు.ఆ రిమోట్‌ను వెదుకునే క్రమంలో జరిగే కథతో పీకే తెరకెక్కింది.

వినేందుకు రెండు కథలు దగ్గరగా అనిపించినప్పటికి రెండు సినిమాలకు చాలా వ్యత్యాసాలున్నాయి.కథలోని పాయింట్‌ మినహా మరేం కూడా ఈ రెండు సినిమాలకు మ్యాచ్‌ కాలేదు.

చిన్న పాయింట్‌ మ్యాచ్‌ అయినా కూడా మనోళ్లు కాపీ అనేస్తారు అది వేరే విషయం అనుకోండి.!.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు