మహేష్ వల్ల వంద కోట్లు కోల్పోయిన రాణా

ప్రిన్స్ మహేష్ బాబు పుణ్యమా అని దగ్గుబాటి రాణా కు 100 కోట్ల మేర నష్టం వాటిల్లింది .దీంతో రాణా, మహేష్ మీద గుర్రుగా ఉన్నాడట అంతేకాదు మహేష్ కనిపించినప్పుడల్లా ‘‘నీవల్ల నేను వందకోట్లు నష్టపోయాను’’ అంటూ అందరిముందే మహేష్ ను అడిగేస్తున్నాడట.

 Rana Loss Hundred Crores Due To Mahesh-TeluguStop.com

రాణా ఏంటి మహేష్ వల్ల వంద కోట్లు నష్టపోవడం ఏంటి ? ఈ ఇద్దరూ ఫ్రెండ్స్ కూడా కాదు, వ్యాపార భాగస్వాములు అంతకన్నా కాదు మరి ఈ నష్టం ఏమిటి? అనే కదా మీ డౌట్ .అయితే ఒక్కసారి రానా తమిళ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడాల్సిందే.

అసలు విషయం ఏంటంటే అప్పట్లో తమిళంలో రిలీజయి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘‘గజినీ’’ సినిమాను మొదట దగ్గుబాటి రాణా నిర్మాతగా తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడట.అందులో తన బాబాయ్, విక్టరీ వెంకటేష్ ను హీరోగా పెట్టి సినిమాను తెరకెక్కించాలని భావించాడట రాణా! అయితే అందుకు వెంకీ నేను సూట్ కాను అని చెప్పడం తో సరాసరి మహేష్ దగ్గరకు వెళ్ళి ఆ ప్రాజెక్టు గురించి మహేష్ కి వివరించాడట అయితే తెలుగు ఆడియన్స్ కు ఇలాంటి సినిమాలు సరిపడవని అసలు అటువంటి సినిమాలు తెలుగులో వర్కవుట్ కావని మహేష్ బాబు ఆ సినిమాను తిరస్కరించాడట.

దీంతో రాణా ఆ సినిమా రీమేక్ హక్కులను తీసుకోకుండా వదిలేశాడట ఆ తర్వాత ఆ సినిమా డబ్బింగ్, రీమేక్ హక్కులను గీతా ఆర్ట్స్ వారు సొంతం చేసుకుని.ఆ చిత్రాన్ని తెలుగులో, హిందీలో నిర్మించి భారీ విజయాలను మూటగట్టుకున్నారని అతను పేర్కొన్నాడు.

ఒకవేళ మహేష్ అప్పుడే ఒప్పుకుని వుండుంటే ‘‘గజని’’ సినిమాను తమ సంస్థ ద్వారా తెలుగు, హిందీ భాషల్లోనూ నిర్మించేవాడని దానివల్ల దాదాపు ఒక వంద కోట్ల లాభం తనకు వచ్చేదని రాణా మీడియాతో పేర్కొన్నాడు.అందుకే ఇప్పుడు ఎక్కడ మహేష్ కనిపించినా రానా నీవలన నాకు వందకోట్లు లాస్ అని అంటుంటాడట.

అది సంగతి!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube