రాష్ట్ర విభజన బిల్లు అటు అసెంబ్లీ లో ,ఇటు శాసన సభ లో తీవ్ర దుమారాన్ని రేపుతున్న సందర్భం లో అసలు బిల్లు లో ఏముంది అన్న విషయం మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది .అందుతున్న సమాచారం ప్రకారం బిల్లు మొత్తం 65 పేజి లలో పొందుపరచి ఉండగా ఇందులో మొత్తం 13 అంశాలను ప్రతిపాదించారు
మొదటి షెడ్యూల్‌లో రాజ్యసభ సభ్యుల వివరాలు, రెండో షెడ్యూల్‌లో శాసనసభ, లోక్ సభ నియోజకవర్గాల పునర్ విభజన వివరాలు ఉంటే మూడో షెడ్యూల్‌లో శాసనమండలి స్థానాల వివరాలు ఉన్నాయి.
ఇక నాలుగో షెడ్యూల్‌లో శాసనమండలి సభ్యుల విభజన, ఐదవ షెడ్యూల్‌లో తెలంగాణ రాష్ట్రంలోని దళిత వర్గాల వివరాలు, ఆరో షెడ్యూల్‌లో తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన వర్గాల వివరాలు, ఏడో షెడ్యూల్‌లో నిధులు, ఎనిమిదో షెడ్యూల్‌లో ఫించన్ల వివరాలు, 9వ షెడ్యూల్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేషన్ల వివరాలు, 10వ షెడ్యూల్‌లో రాష్ట్ర స్థాయి సంస్థలకు సంబంధించిన వివరాలను పొందు పరిచారు.ఇక 11వ షెడ్యూల్‌లో నదీ జలాల నిర్వహణ బోర్డుల విధి విధానాలు, 12వ షెడ్యూల్‌లో బొగ్గు, విద్యుత్ విధి విధానాలు, 13వ షెడ్యూల్‌లో విద్య మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలున్నాయి
నదీ జలాల పంపిణీకి కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్‌గా ఉంటారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు.రెండు రాష్ట్రాలలోను శాసన మండలి కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) కొత్త రాష్ట్రంలో హైకోర్టు ఏర్పడే వరకు రెండు రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉంటుంది.శాసనసభ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.
ఏపిలెజిస్లేచర్.ఓఆర్‌జి అనే వెబ్‌సైట్ లో ఉన్నదని పేర్కొన్నారు.
డ్రాఫ్ట్ బిల్లును అసెంబ్లీ వెబ్‌సైట్లో కూడా పెట్టినట్లు స్పీకర్ చెప్పారు.తెలుగు, ఉర్దూ ప్రతులను కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
అయితే ఆ వెబ్ సైట్ పని చేయకపోవడం విశేషం
.






