సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం నుండి ముస్లిం మైనారిటీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముస్లింలు భారీగా తరలి వెళ్ళారు.
కేంద్ర ప్రభుత్వం ముస్లింల మీద కక్ష గట్టి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తీసుకు వచ్చిందని ముస్లిం మత పెద్దలు ఆరోపించారు.
తమ పూర్వీకులు దానం చేసిన భూములను లాక్కునే విధంగా నల్ల చట్టం రూపొందించారని,దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.







