ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ఘటనలు చాలావరకు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.కొన్నింటి వెనుక చిట్కాలు, ఇంకొన్నింటి వెనుక అనూహ్య సంఘటనలు ఉంటున్నాయి.
తాజాగా హాలీవుడ్ సినిమాను తలపించేలా ఓ భారీ దొంగతనం కేసు తెరపైకి వచ్చింది.దొంగలు పట్టపగలే ఎయిర్‌పోర్టులోకి చొచ్చుకెళ్లి డబ్బుల ట్రక్కును( Money Truck ) దోచేసిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఈ ఘటన కొలంబియాలోని( Colombia ) రియోహాచా పట్టణంలో గురువారం చోటుచేసుకుంది.అక్కడి ఆల్మిరాంటే పడిలా ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ ట్రక్కులో పెద్ద మొత్తంలో డబ్బు తరలించబడుతోంది.
అయితే, ఈ సమాచారం ఎలా లీక్ అయ్యిందో కానీ.దాదాపు 12 మంది దుండగులు రెండు కార్లలో వచ్చి ఎయిర్‌పోర్టులోకి దూసుకెళ్లారు.
వారి దగ్గర మారణాయుధాలు ఉండటంతో, ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎవ్వరూ వారి దారిని అడ్డుకోలేకపోయారు.

వారు ట్రక్కులోకి చొరబడి, దాదాపు 24 బ్యాగుల డబ్బును దోచుకుని అక్కడినుంచి పారిపోయారు.కొంతదూరం వెళ్లిన తర్వాత, ఒక కారును ఆపి అందులో ఉన్న ఒక డబ్బు బ్యాగును కారులో ఉంచి నిప్పంటించారు.మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు అక్కడికి చేరుకొని, లోపల డబ్బు ఉందని తెలుసుకుని ఎగబడ్డారు.
దీంతో పెద్ద మొత్తంలో డబ్బు నోట్ల కట్టలు రోడ్డుపై పడిపోయాయి.అయితే, వాటిలో చాలా వరకు కాలిపోయాయి కూడా.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి నాలుగు డబ్బుల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.అయితే మొత్తం ఎంత మొత్తం డబ్బు దోచుకెళ్లారు? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.కానీ ఈ దొంగతనం చిత్రాలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటన మాత్రం చూస్తే నిజంగా ఇది హాలీవుడ్ సినిమాల్లోనే చూసే సీన్‌లా అనిపించకమానదు.అసలు దొంగలే సినిమాల్ని ఇన్‌స్పైర్ చేస్తున్నారా? లేక సినిమాలు వీళ్లను? చేస్తున్నాయన్న అనుమానం వస్తుంది.