నల్లగొండ జిల్లా: వేసవి కాలం వచ్చిందంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు గేదెలు,ఆవులు జాతీయ రహదారులపైకి విపరీతంగా వస్తుంటాయి.వాహనదారులు ఏమాత్రం వెనరపాటుగా ఉన్నా పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు,ఆటోలు,కార్లు నడిపే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.రాత్రి వేళలో గేదెలు సంచారం ఎక్కువగా ఉంటుంది.
చీకట్లో కనబడే అవకాశం తక్కువగా ఉండడంతో వాటిని ఢీ కొట్టడం వల్ల ప్రాణాలకు హాని కలిగిన ఘటనలు అనేకం ఉన్నాయి.
కాబట్టి డ్రైవర్లు, ముఖ్యంగా చిన్న వాహనదారులు మరింత జాగరూకతతో నిదానంగా వెళ్లాల్సి అవసరం ఉంది.
ఇంటి నుంచి వాహనం తీసుకొని బయటికి వెళ్లినప్పుడు మనపై ఆధారపడిన భార్య,పిల్లలు, తల్లిదండ్రులు మన కోసం ఎదురుచూస్తూ ఉంటారని మరిచిపోకండి.కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా జాగ్రత్తగా ఈ మూడు నెలలు వాహన జాగ్రత్తలు పాటించండి.
జరగరాని సంఘటన ఏదైనా జరిగితే మన కుటుంబం అనాధగా మిగిలిపోతుంది.ఎవరైనా సరే రోడ్డు ఎక్కగానే రయ్ మని దూసుకెళ్లకుండా 50 నుంచి 60 కి.మీ.వేగం లోపే డ్రైవింగ్ చేస్తూ సురక్షితంగా ఇంటికి చేరుకోండి.







