ఈ ఎఫెక్టివ్ ప్యాక్ తో మీ జుట్టు రెండింత‌లు అవుతుంది!

సాధారణంగా కొందరిలో ఉన్న జుట్టు ఊడిపోతుంది.కానీ కొత్త జుట్టు ఎదుగుదల అనేది స‌రిగ్గా ఉండదు.

 Your Hair Will Double In Volume With This Effective Pack! Hair Volume, Hair Grow-TeluguStop.com

దీనివల్ల కురులు రోజురోజుకు పల్చగా మారుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే జుట్టును దట్టంగా మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్( Hair pack ) చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.ఈ ప్యాక్ తో మీ జుట్టును రెండింత‌లు చేసుకోవ‌చ్చు.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు మందారం ఆకులను ( hibiescus leaves )తుంచి వేసుకోవాలి.అలాగే అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్క( ginger ), కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు( curd ), వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె ( coconut oil )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాలు లేదా గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

Telugu Double, Care, Care Tips, Pack, Healthy, Latest, Doublevolume-Telugu Healt

వారానికి ఒకసారి ఈ ప్యాక్ ను కనుక వేసుకుంటే చాలా ప్ర‌యోజ‌నాలు పొందుతారు.మందారం ఆకుల్లోని న్యూట్రియెంట్స్ ఉండటంతో కొత్త జుట్టు పెరుగుదల మెరుగుప‌రుస్తాయి.జుట్టును మందంగా మారుస్తాయి.

అల్లం సహజమైన యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటం వల్ల తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.ఇది హెయిర్ గ్రోత్ ను పెంచ‌డంలో మ‌రియు డాండ్రఫ్ నివార‌ణ‌లో తోడ్ప‌డుతుంది.

Telugu Double, Care, Care Tips, Pack, Healthy, Latest, Doublevolume-Telugu Healt

అలాగే పెరుగు జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది.ఫ్రిజ్ ను తగ్గిస్తుంది.హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడుతుంది.ఇక కొబ్బరి నూనె త‌ల చర్మాన్ని పోషిస్తుంది, తలలో తేమను సమతుల్యం చేస్తుంది.మొత్తంగా ఇప్పుడు చెప్పుకున్న హెయిర్ ప్యాక్ తో ఆరోగ్యమైన ఒత్తైన‌ నిగనిగలాడేలా కురులు మీ సొంతం అవుతాయి.కాబ‌ట్టి, డ‌బుల్ హెయిర్ గ్రోత్ ను కోరుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్యాక్ ను ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube