ఈ ఎఫెక్టివ్ ప్యాక్ తో మీ జుట్టు రెండింతలు అవుతుంది!
TeluguStop.com
సాధారణంగా కొందరిలో ఉన్న జుట్టు ఊడిపోతుంది.కానీ కొత్త జుట్టు ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు.
దీనివల్ల కురులు రోజురోజుకు పల్చగా మారుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే జుట్టును దట్టంగా మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్( Hair Pack ) చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.
ఈ ప్యాక్ తో మీ జుట్టును రెండింతలు చేసుకోవచ్చు.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు మందారం ఆకులను ( Hibiescus Leaves )తుంచి వేసుకోవాలి.
అలాగే అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్క( Ginger ), కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు( Curd ), వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె ( Coconut Oil )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
40 నిమిషాలు లేదా గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
"""/" /
వారానికి ఒకసారి ఈ ప్యాక్ ను కనుక వేసుకుంటే చాలా ప్రయోజనాలు పొందుతారు.
మందారం ఆకుల్లోని న్యూట్రియెంట్స్ ఉండటంతో కొత్త జుట్టు పెరుగుదల మెరుగుపరుస్తాయి.జుట్టును మందంగా మారుస్తాయి.
అల్లం సహజమైన యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటం వల్ల తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఇది హెయిర్ గ్రోత్ ను పెంచడంలో మరియు డాండ్రఫ్ నివారణలో తోడ్పడుతుంది. """/" /
అలాగే పెరుగు జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది.
ఫ్రిజ్ ను తగ్గిస్తుంది.హెయిర్ ఫాల్ సమస్యలకు చెక్ పెడుతుంది.
ఇక కొబ్బరి నూనె తల చర్మాన్ని పోషిస్తుంది, తలలో తేమను సమతుల్యం చేస్తుంది.
మొత్తంగా ఇప్పుడు చెప్పుకున్న హెయిర్ ప్యాక్ తో ఆరోగ్యమైన ఒత్తైన నిగనిగలాడేలా కురులు మీ సొంతం అవుతాయి.
కాబట్టి, డబుల్ హెయిర్ గ్రోత్ ను కోరుకునేవారు తప్పకుండా ఈ ప్యాక్ ను ట్రై చేయండి.