మహేష్ బాబు (Mahesh Babu)లాంటి నటుడు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేది వాస్తవం… ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అతన్ని గొప్ప స్థానంలో నిలబెట్టడమే కాకుండా నటుడిగా భారీ క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.ప్రస్తుతం ఆయన రాజమౌళితో (Rajamouli)పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా మారబోతుందట.ఇక తను ఒక నిధి కోసం వేట కొనసాగిస్తున్న సందర్భంలో కొంతమంది దుండగులు అతని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారట.
అందులో భాగంగానే మహేష్ బాబు ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు.
ఇక ఈ యాక్షన్ ఎపిసోడ్స్ రిస్కీతో ఉన్నప్పటికి తనే ఓన్ గా చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ అయితే చేయలేదు.మరి తొందర్లోనే ఈ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడి చేతిలో హీరో పడితే ఆయన వాళ్ళని భారీగా కష్టపెట్టైన సరే తనకు కావాల్సినట్టుగా రాబట్టుకుంటాడు.

అందువల్లే రాజమౌళికి(Rajamouli) ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉంది.ఇక తనదైన రీతిలో సత్తా చాటుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.మరి ఈ సినిమా తర్వాత మహేష్ బాబు సుకుమార్ డైరెక్షన్ (Mahesh Babu Sukumar Direction)లో ఒక సినిమాలో నటించే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక దాంతో పాటుగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి తను ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి మహేష్ బాబు ఫ్యూచర్ లో ఎలాంటి పాత్రలు చేస్తాడు తను ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది…ఇక మహేష్ బాబు ఇప్పటికే మాస్ హీరోగా ఎదిగిన విషయం మనకు తెలిసిందే…
.