గోరఖ్‌పూర్-లోకమాన్య తిలక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20104)(Gorakhpur-Lokamanya Tilak Superfast Express (20104) రైల్లో జరుగుతున్న అక్రమ నీళ్ల బాటిళ్ల అమ్మకం వ్యవహారం ఒక వీడియో ద్వారా బయటపడింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం భగ్గుమంటున్నారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌పైOn Railway Minister Ashwini Vaishnav) తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.రైల్వే శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అంటూ మండిపడుతున్నారు.
ఒక జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోలో, ఒక ప్రయాణికుడు అక్రమంగా నీళ్ల బాటిళ్లు అమ్ముతున్న వ్యాపారులను నిలదీస్తున్నాడు.ఏసీ బోగీలో రైల్వే శాఖకు చెందిన “రైల్ నీర్(Rail Neer)” వాటర్ బాటిళ్లు అందుబాటులో ఉన్నా కూడా, వ్యాపారులు మాత్రం లోకల్ బ్రాండ్లను అంటగడుతున్నారు.
అంతేకాదు, పాన్ మసాలా అమ్ముకునే ఒక వ్యక్తి ఏసీ బోగీలోకి ఎలా వచ్చాడని కూడా ఆ ప్రయాణికుడు ప్రశ్నించాడు.వాదన జరుగుతుండగానే, ప్యాంట్రీ మేనేజర్(Pantry Manager) అక్కడికి వచ్చి వీడియో తీయొద్దని ప్రయాణికుడిని కోరాడు.
కానీ ప్రయాణికుడు మాత్రం ఆగకుండా రైల్వే క్యాటరింగ్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో, నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉందో విమర్శిస్తూనే ఉన్నాడు.ఇంతలో వీడియో సడన్‌గా ఆగిపోయింది.
వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ కామెంట్ పెడుతూ, “రైళ్లలో ఫుడ్, వాటర్ రాకెట్ (food, water rocket on trains”)నడుస్తున్నట్టు ఉంది.లోకల్ ప్రొడక్ట్స్ ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు, కానీ రైల్వే వాళ్ల రైల్ నీర్ బాటిళ్లు మాత్రం పట్టించుకోవడం లేదు.ఈ వీడియో కుర్లా ఎక్స్‌ప్రెస్‌లో తీసినట్టున్నారు.ఎప్పుడనేది కరెక్ట్‌గా తెలీదు.అశ్విని వైష్ణవ్ సర్.దయచేసి చర్యలు తీసుకోండి” అని కోరారు.ఈ వీడియోని దాదాపు మూడు లక్షల మందికి పైగా చూశారు.నెటిజన్లు మండిపడుతున్నారు.“ఇది మన దేశంలో ఎప్పటినుంచో జరుగుతోంది.అందరికీ వాటాలు అందుతాయి, అందుకే ప్రయాణికులు మోసపోతూనే ఉంటారు.వ్యాపారుల కళ్లలో భయం చూస్తుంటే సంతోషంగా ఉంది” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.“మేనేజర్‌ను సస్పెండ్ చేయండి.వీళ్లు రైల్వే క్యాటరింగ్‌ను నాశనం చేసేశారు.” అంటూ ఇంకొక యూజర్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
ఇలా జరగడం కొత్తేమీ కాదు.2019లోనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) “ఆపరేషన్ థర్స్ట్” పేరుతో అక్రమ నీళ్ల అమ్మకాలను అరికట్టడానికి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది.అప్పుడు 1,371 మందిని అరెస్ట్ చేసి, 69,000 పైగా బాటిళ్లను సీజ్ చేశారు.ఎన్ని ప్రయత్నాలు చేసినా, అక్రమ వ్యాపారులు మాత్రం రైళ్లలో ఫేక్ ప్రొడక్ట్స్ అమ్ముతూనే ఉన్నారు.
ఇది ప్రయాణికుల భద్రతకు, రైల్వే నిర్వహణకు పెద్ద ప్రమాదకరంగా మారింది.