చికిత్స కోసం స్వయంగా మెడికల్ షాప్ వద్దకు వెళ్లిన కోతి.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్( Viral Video ) అవుతుంటాయి.అప్పుడప్పుడు కోతుల చేష్టలు నెటిజన్లను ఆకర్షిస్తాయి.

 Injured Monkey Rushes To Pharmacy Video Viral Details, Monkey Viral Video, Bang-TeluguStop.com

అవి మనుషులను అనుకరించడం, తెలివిగా ప్రవర్తించడం తరచుగా చూసే దృశ్యాలే.మనుషుల బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి వాటి సరదా పనులతో నవ్విస్తుంటాయి.

అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ కోతి( Monkey ) సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.సాధారణంగా కోతులు గుంపులుగా జీవిస్తాయి.

కొన్నిసార్లు మానవ నివాసాల్లోకి వచ్చి ఆహారం వెతుకుతాయి.కానీ ఈసారి ఓ కోతి నేరుగా ఓ మెడికల్ షాప్( Medical Shop ) లోకి వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ అరుదైన సంఘటన బంగ్లాదేశ్‌లోని( Bangladesh ) మెహెర్‌పూర్‌లో చోటుచేసుకుంది.అక్కడ ఓ కోతి దాని గాయానికి చికిత్స చేయించుకోవడానికి నేరుగా మెడికల్ షాపుకు వెళ్లింది.అక్కడ ఉన్న వ్యక్తికి తాను ఎక్కడ గాయపడిందో తెలియజేయడానికి ప్రయత్నించింది.ఈ సంఘటనతో అక్కడున్న ప్రజలను ఆశ్చర్యపరిచింది.ఆ కోతికి సహాయం చేయడానికి స్థానికులు ముందుకొచ్చారు.వారిలో ఒకరు కోతికి చికిత్స అందించి, గాయానికి కట్టు కట్టారు.

ఈ సంఘటనను అక్కడున్నవారు సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీనితో, అది వేగంగా వైరల్‌గా మారింది.వేలాది మంది ఈ వీడియోపై స్పందించి మానవత్వం ఇంకా బతికే ఉందని వ్యాఖ్యానించారు.మరికొందరు ఈ కోతి చాలా తెలివైనదని కామెంట్ చేస్తున్నారు.

ఈ ఘటన కోతుల తెలివితేటలు, వాటి అనుభవ సామర్థ్యాన్ని మరోసారి నెమరు వేసేలా చేసింది.మానవాళికి సహజంగా ఉండే బాధ్యతాయుతమైన సహాయస్ఫూర్తిని గుర్తు చేసింది.

ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube