“నేను విదేశాల్లో ఉంటేనే నిజమైన భారతీయురాలిని అయ్యాను” అంటూ పారిస్‌లో ఉంటున్న ఓ భారతీయ మహిళ(Indian woman) చేసిన సంచలన ప్రకటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.రెడిట్‌లో (Reddit)ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.
మూడేళ్లుగా పారిస్‌లో ఉంటున్న ఆమె ఇండియాలో ఉన్నప్పుడు తన సంస్కృతి గురించి అంతగా పట్టించుకోలేదని, అది నిత్య జీవితంలో భాగం కాబట్టి పెద్దగా అనిపించేది కాదని చెప్పుకొచ్చింది.కానీ, దేశం దాటి బయట అడుగుపెట్టాకే దాని విలువ తెలిసి వచ్చిందంటోంది.ముఖ్యంగా భారతీయ వంటకాలు, సంగీతం(Indian cuisine, music) కోసం తపిస్తున్నానని చెప్పింది.
“ఎన్ని రకాల వంటకాలు తిన్నా, మన ఇండియన్ ఫుడ్ (Indian Food)ముందు ఏదీ బాగోలేదు.రుచి మాత్రమే కాదు, అందులోని మసాలాలు, ప్రతి వంటకం ఒక అనుభూతి.ఇక్కడి ఆహారం చాలా సింపుల్‌గా ఉంది” అని ఆమె వాపోయింది.అంతేకాదు, భారతీయ వంటకాల గురించి ఇతరులకు వివరిస్తూ “అన్నీ కర్రీలు కాదు” అని చెప్పాల్సి వస్తోందని కూడా తెలిపింది.ఇండియాలో ఉన్నప్పుడు భారతీయ సంగీతం గురించి పెద్దగా పట్టించుకోని ఆమె, ఇప్పుడు మాత్రం దానికి విలువిస్తోంది.
దేశానికి దూరంగా ఉండటం వల్ల దానిపై ప్రేమ మరింత పెరిగిందని అంటోంది.

దేశంలో చాలా సమస్యలు ఉన్నా, తన దేశంపై ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఆమె స్పష్టం చేసింది.ఇటీవల ఇండియాకు వచ్చినప్పుడు ఎర్రకోట లైట్ అండ్ సౌండ్ షోకి (Red Fort Light and Sound Show)వెళ్లిన ఆమె అది చూస్తుండగానే కన్నీళ్లు పెట్టుకుందట.షాజహాన్ కోట కట్టడం నుంచి దేశం కష్టాల వరకు ఆ షో భారత చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించిందని, అది తన హృదయాన్ని తాకిందని ఆమె ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది.
ఆమె పోస్ట్‌పై మిశ్రమ స్పందనలు వచ్చాయి.కొంతమంది ప్రవాస భారతీయులు ఆమెతో ఏకీభవించారు.“నువ్వు ఎప్పటికీ భారతీయురాలిగానే ఉంటావు.దేశం ఓటమికి కుమిలిపోతావు, గెలుపును సంబరం చేసుకుంటావు” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.“నాకు ఇండియా అంటే మిస్సింగ్.డబ్బులు లేకపోతే ఇప్పుడే ఇండియాకి వచ్చేస్తా” అని మరొకరు రాసుకొచ్చారు.

అయితే, మరికొందరు మాత్రం ఆమెతో విభేదించారు.విదేశాలకు వెళ్లడం వల్ల ఇండియాలోని లోపాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు.“విదేశాల్లో మంచి పౌర స్పృహ, సౌకర్యాలు, పరిశుభ్రత ఉన్నాయి.మనకెందుకు లేదు?” అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు.మొత్తానికి, విదేశాల్లో నివసించడం వల్ల భారత్‌తో ప్రజల అనుబంధం ఎలా మారుతుందనే దానిపై ఈ చర్చ అనేక కోణాలను వెలుగులోకి తెచ్చింది.







