సినీ ఇండస్ట్రీలో సహజ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దివంగత నటి సౌందర్య( Soundarya )ఒకరు.ఈమె చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చే తక్కువ సమయంలోనే అగ్ర హీరోలదరి సరసన నటించిన దక్షిణాది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు.
ఇక సౌందర్య ఇండస్ట్రీ లోకి వచ్చి ఎంత తొందరగా సక్సెస్ అందుకున్నారు .అంతే తొందరగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు.హెలికాప్టర్ ప్రమాదంలో ఈమె మరణించిన సంగతి తెలిసిందే.ఇప్పటికీ సౌందర్యం మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి.సౌందర్య మరణించి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది అయితే ఈమె మరణం సహజ మరణం అని ప్రమాదవశాత్తు జరిగిందని అందరూ భావించారు అయితే ఇన్నేళ్ల తర్వాత సౌందర్య మరణం సహజ మరణం కాదని ఆమె మరణం వెనుక కుట్ర జరిగింది అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇక ఈ కుట్ర వెనుక టాలీవుడ్ హీరో హస్తం ఉంది అంటూ ఆయన ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త సంచలనగా మారింది.
అసలు సౌందర్య మరణం గురించి సాక్ష్యం చెప్పిన ఆ వ్యక్తి ఎవరు నిజంగానే సౌందర్య మరణం వెనుక కుట్ర జరిగిందా అనే విషయానికి వస్తే.

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురు గట్ల చిట్టిబాబు( Chitti Babu ) ఈ ఆరోపణలు చేస్తున్నాడు.సినీ నటి సౌందర్యం మరణం వెనుక సీనియర్ నటుడు మోహన్ బాబు( Mohan Babu ) హస్తము ఉందని ఈయన తెలిపారు.హీరోయిన్ సౌందర్యకు శంషాబాద్ జల్లేపల్లిలో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని దానిని తమకు అమ్మాలంటూ మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని తెలిపారు.
అయితే దీనిని మనసులో పెట్టుకున్న మోహన్ బాబు బెంగళూరు నుంచి తెలంగాణ పార్టీ ప్రచారానికి వస్తున్న వారిని సాక్షాలు దొరక్కుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని తెలిపారు.

ఈ విధంగా సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె ఆస్తులన్నీ మోహన్ బాబు అనుభవిస్తున్నారని చిట్టిబాబు తన కంప్లైయింట్ లో తెలిపాడు.దీంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.ఈ ఇంటి విషయంలోనే మోహన్ బాబు మంచు విష్ణు మధ్య గొడవలు జరుగుతున్న ఇలాంటి నేపథ్యంలో చిట్టిబాబు కంప్లైంట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇక ఈ విషయం తెలియజేసినందుకు తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు నుంచి తనని రక్షించాలి అంటూ కూడా ఈయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా సౌందర్య మరణం తర్వాత 20 ఏళ్లకు ఆమెది సహజ మరణం కాదు కుట్ర జరిగింది అంటూ ఆరోపణలు చేయడంతో అభిమానులు షాక్ లో ఉన్నారు.







