ఈగ సినిమాకు సీక్వెల్ వస్తోందట.. అసలు ట్విస్ట్ తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే!

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS rajamouli) దర్శకత్వం తెరకెక్కిన సినిమాలలో ఈగ(EEGA) సినిమా కూడా ఒకటి.ఈ సినిమాది రాజమౌళి ఫిలింగ్రఫీలోనే చెక్కుచెదరని స్థానం చెప్పవచ్చు.

 Lovely Official Teaser Story Of Eega, Eega 2, Eega Movie, Rajamouli, Nani, Tamil-TeluguStop.com

మగధీర లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత అసలు స్టార్లే లేకుండా జక్కన్న తీసిన సినిమాలు రెండు.మొదటిది మర్యాద రామన్న ఘన విజయం అందుకోగా ఈగ ఏకంగా రికార్డులు బద్దలు కొట్టింది.

అయితే దీనికి సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా విషయం తెలిసిందే.కానీ రాజమౌళి మాత్రం ఆ దిశగా ఆలోచన చేయలేదు.

పైగా బాహుబలి(Bahubali) తర్వాత ప్యాన్ ఇండియా మార్కెట్ అంతకంతా పెరిగిపోవడంతో మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్లలేని పరిస్థితి.దీంతో ఈగ 2 (Eega2)టైటిల్ కాదు కానీ అచ్చం అదే తరహా గ్రాఫిక్స్ తో తమిళ తెలుగులో ఒక సినిమా రాబోతోంది.

అదే లవ్లీ.మాథివ్ థామస్ హీరోగా దినేష్ కరుణాకరన్ (Lovely.

Mathiv Thomas and Dinesh Karunakaran as the hero)దర్శకత్వంలో రూపొందిన లవ్లీ ట్రైలర్ నిన్న వచ్చింది.థియేటర్లలో ఏప్రిల్ 4 సినిమాని విడుదల చేయబోతున్నారు.

కథేంటో కూడా చెప్పేశారు.ఒక చిన్న ఈగకు ఒక యువకుడితో స్నేహం కుదురుతుంది.

అతనితో దోస్తీ చేసి ఎన్నో విషయాలు పంచుకుంటుంది.

Telugu Eega, Lovelyofficial, Nani, Rajamouli, Tamil-Movie

హీరోకు ఏదైనా సమస్య వస్తే సలహాలు ఇస్తుంది.ఇబ్బందుల్లో పడితే ఆదుకుంటుంది.మరి వీళిద్దరి ఫ్రెండ్ షిప్ లో విలన్ ఎవరు, హీరోయిన్ ఎక్కడ ఉంది లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడమని చెబుతున్నారు.

స్టోరీ ఎక్కువ రివీల్ కాకుండా జాగ్రత్తగా కట్ చేశారు కానీ ట్రైలర్ లో చెబుతారేమో చూడాలి మరి.అయితే ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ అచ్చం ఈగ సినిమా లాగే ఉన్నాయి.డిజైన్ కూడా ఏ మాత్రం మార్చకుండా యధాతథంగా దించేశారు.ఈగ 2 అని టైటిల్ పెడితే యాప్ట్ అనిపించేలా ఉంది.నటీనటులు, సాంకేతిక వర్గం అంతా మనకు పెద్దగా పరిచయం లేని బాపతే.కానీ తెలుగుతో పాటు మొత్తం నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube