ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025( ICC Champions Trophy 2025 ) చివరి అంకానికి చేరుకుంది.ప్రపంచంలోని ఉత్తమ జట్లు తలపడి, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరగగా.
చివరికి ఫైనల్‌కు భారత్ ( India ), న్యూజిలాండ్ ( New Zealand ) జట్లు చేరుకున్నాయి.ఈ పండగ వాతావరణం అందరినీ మరింత ఉత్సాహపరుస్తోంది.
ఈనెల 9న (ఆదివారం) దుబాయ్ ( Dubai ) వేదికగా జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత్ అభిమానులకు క్రికెట్ అంటే ఉన్న మోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
టీమిండియా మ్యాచ్ అంటే ఏ పని ఉన్నా పక్కన పెట్టి టీవీల ముందు, ఫోన్ల ముందు అతుక్కుపోతారు.అంతే కాకుండా స్టేడియానికి వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ చూడడాన్ని మరింత ఎక్కువగా ఇష్టపడతారు.
ముఖ్యంగా, ఇంతటి గొప్ప ఫైనల్ మ్యాచ్ కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు.

గతంలో ఐపీఎల్ ( IPL ) మ్యాచ్‌లను కొన్ని నగరాల్లో బిగ్ స్క్రీన్లపై ప్రదర్శించిన సంగతి తెలిసిందే.అదే తరహాలో, ఇప్పుడు తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ ( Hyderabad ) నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.నగరంలోని పలు మల్టీప్లెక్స్‌లలో ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఇప్పటికే కొన్ని మల్టీప్లెక్స్‌లలో( Multiplex ) బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇది వినూత్నమైన అనుభవంగా మారబోతుంది.

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఎంతో హోరాహోరీగా సాగుతుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.ప్రత్యేకంగా టీమిండియా గెలుపును కోరుకుంటున్న అభిమానులు, తమ ప్రియ జట్టు విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.ముఖ్యంగా, ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక ప్లాన్స్ వేసుకుని, కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి పెద్ద స్క్రీన్‌లపై మ్యాచ్ చూడడానికి సిద్ధమవుతున్నారు.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ భారత్ గెలిస్తే, ఇది టీమిండియా అభిమానులకు ఒక మధుర స్మరణగా నిలిచిపోతుంది.
ఈ సారి కోహ్లి, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్ల ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది.మరి.టీమిండియా విజయం సాధించి, దేశానికి మరొక టైటిల్ అందిస్తుందా? లేదా అనేది ఈ ఆదివారం దుబాయ్ స్టేడియంలో ఏం జరగబోతోందో చూడాలి.







