అమెరికా దగ్గర నీటిలో వింత దృశ్యం.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

తాహితీ తీరంలో( Tahiti ) ఇటీవల ఒక అద్భుతం జరిగింది.ఒక్కసారిగా ఆకాశం నుంచి నీళ్లలోకి దిగినట్టు ఒక పెద్ద సుడిగాలి ఏర్పడింది దాన్ని చూసినోళ్లంతా షాకయ్యారు.

 You Will Be Shocked To See A Strange Scene In The Water Near America, Tahiti Wat-TeluguStop.com

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జనాలు నోరెళ్లబెట్టి చూస్తున్నారు.

నిజంగానే ప్రకృతి ఎంత పవర్‌ఫులో కదా అని అనుకుంటున్నారు.అదృష్టం ఏంటంటే ఈ సుడిగాలి సముద్రంలోనే తిరిగేసింది, ఒడ్డుకు రాలేదు.

లేకపోతే అంతే సంగతులు.జల సుడిగుండం అంటే నీళ్ల మీద వచ్చే టోర్నడో లాంటిది.

తుఫాను మేఘాల నుంచి ఒక గొట్టంలాగా నీళ్ల దాకా దిగుతుంది. టోర్నడోల్లాగే( tornado ) ఇది కూడా తిరుగుతూ వస్తుంది కానీ ఇది ఎక్కువగా సముద్రాలు, సరస్సులు లేదా పెద్ద నీటి ప్రదేశాల్లోనే వస్తుంది.

కొన్ని జల సుడిగుండాలు భయంకరమైన తుఫానులతో వస్తాయి, మరికొన్ని మాత్రం అలా సింపుల్ గా వచ్చి పోతుంటాయి.కొన్నిసార్లు వీటి వల్ల పెద్ద నష్టం జరిగే ఛాన్స్ ఉంది, కానీ చాలా వరకు హాని చేయకుండానే మాయం అయిపోతాయి.

తాహితీలో కనిపించిన ఈ జల సుడిగుండం వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ చెప్పవచ్చు.ఒక పెద్ద గొట్టంలాంటిది ఆకాశం వైపు నుంచి సముద్రంలోకి దిగి భయంకరంగా తిరుగుతోంది.పైనంతా నల్లటి మబ్బులు, సీన్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేలా ఉంది.ఒక పడవలో ఉన్న వాళ్ళు ఈ వీడియో తీశారు.సుడిగాలి ఎంత శక్తివంతంగా ఉందంటే నీళ్లు, నురగ మొత్తం పైకి లేస్తున్నాయి.ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు.

వీడియో చూసినోళ్లంతా షాక్ తిన్నారు, భలే ఉంది కానీ భయంగా కూడా ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు.

ఈ వింతను కళ్లారా చూసిన వాళ్లు మాత్రం అవాక్కయ్యారు.మోరేయా ( Morea )అనే దీవిలో ఉండి చూసిన ఒకతను ఏమన్నాడంటే.“వావ్, ప్రకృతి అంటే ఇదే కదా పవర్.మా ఫ్రెండ్స్, నావికులు తాహితీ దగ్గర ఉన్నారు, దేవుడి దయ వల్ల వాళ్లకి ఏమీ కాలేదు.మేమైతే మోరేయాలో దూరం నుంచి చూస్తున్నాం, మా వైపు రాకుండా ఉండాలని కోరుకున్నాం.” అని చెప్పాడు.సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఇదే ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నారు.

జల సుడిగుండం చూడటానికి ఎంత అందంగా ఉందో, అంతే డేంజర్ కూడా అని అంటున్నారు.వీడియో మాత్రం తెగ వైరల్ అయిపోయింది.వెదర్ రిపోర్టర్స్ నుంచి కామన్ జనం దాకా అందరూ షేర్లు, కామెంట్లు చేస్తున్నారు.వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, జల సుడిగుండాలు ఎక్కువగా వెచ్చని గాలి నీటి ఉపరితలం నుంచి పైకి లేచి, చల్లటి గాలితో కలిసినప్పుడు ఏర్పడతాయి.

అప్పుడు గిర్రున తిరిగే ఎఫెక్ట్ వస్తుంది.తాహితీలో కూడా ఇలాంటి వాతావరణం ఉండటం వల్లే ఈ సుడిగుండం వచ్చిందంటున్నారు.

ఒకవేళ ఈ సుడిగాలి ఒడ్డుకు వచ్చి ఉంటే టోర్నడోలా మారిపోయేది, అప్పుడు జనాలకి, ఇళ్లకు చాలా నష్టం జరిగేది.ఇలాంటి జల సుడిగుండాలు ఎక్కువగా వేడి, తేమ వాతావరణం ఉన్న ప్రదేశాల్లో కనిపిస్తాయి.ముఖ్యంగా తుఫానులు వచ్చే ఏరియాల్లో ఇవి ఎక్కువ.https://www.instagram.com/p/DG2Cn1zOXBw/?utm_source=ig_web_copy_link ఈ లింకు మీద క్లిక్ చేసి దీని పిక్స్ కూడా చూడొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube