విదేశాల్లో MBA చేయాలనీ కలలు కంటున్నారా, ముఖ్యంగా యూకే( UK ) లాంటి దేశాల్లో చదవాలంటే ఫీజులు చూసి వెనకడుగు వేస్తున్నారా, అయితే మీకో గుడ్ న్యూస్.షెఫీల్డ్ యూనివర్సిటీ( Sheffield University ) మేనేజ్‌మెంట్ స్కూల్ ఇండియన్ స్టూడెంట్స్( Indian Students ) కోసం అదిరిపోయే స్కాలర్‌షిప్ ఆఫర్ ప్రకటించింది.2025, సెప్టెంబర్‌లో MBA ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాళ్లకి ఏకంగా 50% ఫీజు తగ్గింపు ఇస్తోంది.దీంతో మీ MBA కలను నిజం చేసుకోవడం మరింత సులువు అవుతుంది.
షెఫీల్డ్ యూనివర్సిటీ MBA ప్రోగ్రామ్ ఫీజు దాదాపు రూ.37 లక్షలు ఉంటుంది.కానీ ఈ స్కాలర్‌షిప్( Scholarship ) ద్వారా మీరు సగం ఫీజు అంటే దాదాపు రూ.18.5 లక్షలు ఆదా చేసుకోవచ్చు.ఈ డబ్బు మీ ఫీజులోంచి నేరుగా తగ్గిస్తారు, మీ చేతికి క్యాష్ ఇవ్వరు.
MBA ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ వచ్చినవాళ్లు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కి అర్హులు.
ఈ స్కాలర్‌షిప్ కోసం మీరు ప్రత్యేకంగా అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు.
ఎవరైతే MBA ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ ఆఫర్ పొందుతారో వాళ్లందరినీ ఆటోమేటిక్‌గా స్కాలర్‌షిప్ కోసం పరిశీలిస్తారు.మీ అప్లికేషన్, డాక్యుమెంట్స్, ఇంటర్వ్యూలో మీ పెర్ఫార్మెన్స్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు.
ఒకవేళ మీకు వేరే స్కాలర్‌షిప్ లేదా ఫైనాన్షియల్ ఎయిడ్ ఉంటే, మీరు ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవడానికి కుదరదు.

సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే, యూనివర్సిటీ ప్యానెల్ మిమ్మల్ని ఈ కింది వాటి ఆధారంగా ఎంపిక చేస్తుంది.మీరు ఎందుకు MBA చేయాలనుకుంటున్నారో చెప్పే స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (SOP)ని, మీ గురించి ఇతరులు రాసే రికమెండేషన్ లెటర్స్‌ని, ఇంకా మీకు సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌ని చెక్ చేస్తుంది.అంతేకాదు, మీరు ఓ నాలుగు ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి (ఒక్కో దానికి 200 పదాల్లోపు).అవేంటంటే మీరు MBA ఎందుకు చేయాలనుకుంటున్నారు?, మీ ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్స్ ఏంటి? మీరు ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు?,

షెఫీల్డ్ యూనివర్సిటీలో MBA చేయడం మీ కెరీర్‌కి ఎలా హెల్ప్ అవుతుంది?, మీ ఇప్పటివరకు ఉన్న అచీవ్‌మెంట్స్ మీ కెరీర్ గోల్స్‌కి ఎలా సరిపోతాయి? అవే ఈ ప్రశ్నలు.మీరు రాసిన సమాధానాల ఆధారంగా మీకు స్కోర్ ఇస్తారు.యూనివర్సిటీ ప్యానెల్ కొంతమందిని షార్ట్‌లిస్ట్ చేస్తుంది.ఫైనల్‌గా MBA ప్రోగ్రామ్ డైరెక్టర్ నిర్ణయం తీసుకుంటారు.మరింత సమాచారం కావాలంటే, షెఫీల్డ్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.