ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఒక ప్రత్యేకమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి నటుడు సైతం ప్రస్తుతం భారీ సినిమాలను చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.
మరి తను చేస్తున్న సినిమాలన్నింటితో భారీ విజయాలను సాధిస్తాడా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.సెట్స్ మీద ఉన్న మూడు సినిమాల్లో ఈ సంవత్సరం థియేటర్లోకి తీసుకురావాలనే ఉద్దేశ్యం తో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా( Deputy CM ) తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నారు.కాబట్టి ఇప్పుడున్న పొజిషన్ లో ఆయన తొందరగా సినిమాలు చేసే అవకాశం అయితే లేదు.ఎందుకంటే ఆయన చేసే సినిమాలకు చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన అవసరమైతే ఉంది.కాబట్టి ప్రస్తుతం ఆయనకు అంత సమయం అయితే లేదు.ఇక హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమాను తొందర్లోనే థియేటర్లోకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు.అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చివరలో చనిపోతాడా? అనే కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ చివరలో చనిపోతాడు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి… మరి వాటికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ సినిమాలో బతికి ఉంటాడా? చనిపోతాడా అనేది తెలియాలంటే మాత్రం సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…ఇక ఇప్పటి వరకు ఎవరూ ఎన్ని సినిమాలు చేసిన ఒక్క సారి పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే రికార్డ్ లన్ని బ్రేక్ అవ్వాల్సిందే…చూడాలి మరి ఈ సినిమాలు సక్సెస్ అవుతాయా లేదా అనేది…
.







