తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం.

ప్రస్తుతానికైతే ఆయన సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమాతో సక్సెస్ ని సాధించారు.కాబట్టి ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.ఇక ఇప్పుడు కొంతమంది యంగ్ డైరెక్టర్లతో సినిమాను చేయాలనే ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే కొన్ని కథలను కూడా వింటున్న వెంకటేష్ తన తదుపరి సినిమా కూడా 100 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆయన భారీ ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తుంది… మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో వెంకటేష్ అయితే సక్సెస్ అయ్యాడు.

ఇక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఆయన ఎప్పుడు సినిమా చేసిన కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తాడని మరోసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు.ఇక ఇప్పటివరకు బాగానే ఉంది.ఇక మీదట వెంకటేష్ కనుక సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకుంటే ఆయనను మించిన సీనియర్ హీరో మరొకరు ఉండరు అనేది ప్రూవ్ అవుతుంది.ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలందరిలో వెంకటేష్ భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందు వరుసలో ఉన్నాడు.
ఇక ఇది ఏమైనా కూడా భారీ విజయాన్ని అందుకుంటున్న స్టార్ హీరోలను సైతం ఆయన వెనక్కి నెట్టుతూ ముందుకు సాగుతున్నారు…
.