యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సోమవారం యాదగిరిగుట్ట ఆలయంలో ఘనంగా నిర్వహించారు.ప్రత్యేక పూజలు నిర్వహించి,కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత,పైళ్ల శేఖర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్,మాజీ జెడ్పీీ చైర్మన్ సందీప్ రెడ్డి,గొంగిడి మహేందర్ రెడ్డి,జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల కృష్ణారెడ్డి,రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, తుంగ బాలు,ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.