మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) సినిమా ఇండస్ట్రీలో అందరివాడిగా గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.చిరంజీవి తన కెరీర్ లో వివాదాలకు దూరంగా ఉన్నారు.
చిరంజీవి అతి మంచితనం వల్లే ఆయన రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారని చాలామంది భావిస్తారు.తాజాగా చిరంజీవి లైలా( Laila Movie ) ఈవెంట్ లో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి మాట్లాడుతూ పరిశ్రమలో అందరూ ఒకటేనని మా మధ్య ఎలాంటి కాంపౌండ్స్ లేవని ఎలాంటి అరమరికల్లేవని చెప్పుకొచ్చారు.అయితే చిరంజీవి చెప్పిన మాట నిజమేనా పరిశ్రమలో నిజంగానే కాంపౌండ్ వాల్స్ లేవా? అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది.సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ వాళ్లకు స్పెషల్ గా ఉంది.

తాజాగా ఒక స్టార్ హీరో మాట్లాడుతూ ఇండస్ట్రీలో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి కూడా పీఆర్ లను ఉపయోగించడం జరుగుతోందని వెల్లడించారు.పెద్ద సినిమాల బెనిఫిట్ షోలు సైతం పూర్తి కాకముందే ఆ సినిమాల గురించి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న సందర్భాలు బోలెడు ఉన్నాయి.పాజిటివ్ పీఆర్ కోసం నెలకు లక్ష నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆ హీరో చెప్పుకొచ్చారు.

చిరంజీవి చెప్పిన మాటలు మంచి మాటలే అయినప్పటికీ నిజ జీవితంలో ఆ మాటలను పాటించే వాళ్లు ఎంతమంది అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా విశ్వంభర ఈ ఏడాదే రిలీజ్ కానుండగా చిరు అనిల్ కాంబో మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.ఏడు పదుల వయస్సులో కూడా చిరంజీవి వరుస సినిమాలలో నటిస్తున్నారు.







