సాధారణంగా చాలావరకు మనలో చాలామంది ప్రతి రోజు పాలను తాగుతూ ఉంటారు .అందుకు గల ముఖ్య కారణం పాలలో ఉండే అనేక పోషకాలు.
అలాగే పాలలో నీరు, చక్కెర, కొవ్వు, ప్రోటీన్, ఖనిజాలు( Water, sugar, fat, protein, minerals ) కూడా కలిగి ఉంటుంది .సాధారణంగా పాలు తెలుపు రంగులో కనిపిస్తాయి.ఇది అందరికి తెలిసిన విషయమే.కానీ, కొన్ని జంతువుల జాతి.అవి తీసుకునే ఆహారం వంటివాటిపై ఆధారపడి పాల రంగులో (milky color)మార్పు వచ్చే అవకాశాలు ఎక్కువ.అయితే, చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.
ఖడ్గమృగం (Rhinoceros)నల్లగా కనిపించే పాలను (Milk)ఉత్పత్తి చేస్తుందని.

ఏంటి పళ్ళు నల్లగా ఉండడమేంటి అని అనుకుంటున్నారా? ఔను నిజమే.దీనికి ప్రధాన కారణం పాలలో అధిక స్థాయిలో ఐరన్( Iron ) సమూహం ఉండటమే అని కొందరి అభిప్రాయం.ఖడ్గమృగాలు అధిక ఐరన్ కలిగిన ఆహారాన్ని తీసుకునే కారణంగా, వారి పాలలో కూడా ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది.
ఐరన్ పాలలోని ప్రోటీన్లతో కలిసి నల్లటి రంగును కలిగిస్తుంది.అంతేకాదు, కొన్ని సందర్భాల్లో ఖడ్గమృగం పాలు నీలం రంగులోనూ కనిపించవచ్చు.ఇది కాంతి పరావర్తనం విధానంపై ఆధారపడి ఉంటుంది.ఖడ్గమృగం పాలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది, అదే సమయంలో ఆవు, గేదె( Cow, buffalo ) వంటి జంతువుల పాలలో కొవ్వు అధికంగా ఉండటం వల్ల అవి తెల్లగా కనిపిస్తాయి.

మానవులకు ఖడ్గమృగం పాలు పెద్దగా ఉపయోగపడవు.ఎందుకంటే వాటిలో పోషకాలు తక్కువగా ఉంటాయి.అంతేగాక, ఖడ్గమృగాలు అంతరించిపోతున్న జంతువులు కావడంతో వాటిని సంరక్షించడం ఎంతో అవసరం.అందువల్ల, ఖడ్గమృగం పాలను సాధారణంగా వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం కుదరదు అనే చెప్పాలి.పాలు నల్లగా కూడా ఉంటాయని మీలో ఎంతమందికి తెలుసో ఓ కామెంట్ చేయండి.







