ముంబై-ఆగ్రా జాతీయ రహదారి( Mumbai-Agra National Highway ) పక్కనే ఉన్న పాతర్డి ఫాటా దగ్గర గుండెలు పిండేసే ఘటన జరిగింది.బుధవారం మధ్యాహ్నం ఒక హోటల్ పార్కింగ్‌లో( Hotel Parking ) జరిగిన ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల పసి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ యాక్సిడెంట్ పార్కింగ్ స్థలాల్లో భద్రత, నిర్లక్ష్యం గురించి పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది.
వివరాల్లోకి వెళ్తే, ఆ పిల్లాడు తన తండ్రితో కలిసి హోటల్‌కి వచ్చాడు.
తండ్రి డ్రైవరు కావడంతో ప్యాసింజర్లను దింపడానికి హోటల్‌కు వచ్చారు.కారు దిగిన వెంటనే ఆ చిన్నారి( Child ) పార్కింగ్ ఏరియాలో ఆడుకోవడం మొదలుపెట్టాడు.
తండ్రి కారు పార్క్ చేస్తుండగా, ఇంతలో మరో కారు పార్కింగ్‌లోకి( Car Parking ) వచ్చింది.ఒక్క క్షణంలో ఆ పిల్లాడు పరిగెడుతూ రోడ్డు దాటుతుండగా కాలు జారి నేరుగా కదులుతున్న కారు కింద పడిపోయాడు.
స్థానికులు, హోటల్ సిబ్బంది వెంటనే హాస్పిటల్‌కు తరలించినా, తీవ్ర గాయాలవల్ల అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.

ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహించాలి? అనే దానిపై సోషల్ మీడియా వేదిక ఎక్స్ ప్లాట్‌ఫామ్ లో పెద్ద చర్చ జరుగుతోంది.కొందరు డ్రైవర్‌ను తప్పు పడుతుంటే, మరికొందరు అసలు తప్పు తల్లిదండ్రులదే అంటున్నారు.ప్రమాదానికి సంబంధించిన వీడియో చూస్తే డ్రైవర్ పార్కింగ్ ఏరియాలో నెమ్మదిగానే వెళ్తున్నాడు.
కానీ, ఆ పిల్లాడు ఒక్క క్షణంలో కారు ముందుకి పరిగెత్తుకుంటూ వచ్చి జారి పడిపోయాడు.దీంతో డ్రైవర్ కారు ఆపడం దాదాపు అసాధ్యం అయింది.

చాలామంది డ్రైవర్‌ను నిందించడం సరికాదని వాదిస్తున్నారు.“పాపం డ్రైవర్‌ను నిందిస్తున్నారు, కానీ అతను ఈ ప్రమాదం జరగకుండా ఏమీ చేయలేకపోయాడు.ఇప్పుడు అతను అనవసరంగా లీగల్ చిక్కుల్లో ఇరుక్కుపోయాడు, ఇది అతనికి చాలా బాధాకరమైన విషయం” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.మరొకరు స్పందిస్తూ.“డ్రైవర్ నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు.అసలు తప్పు తండ్రిదే.
పిల్లవాడిని చూడకుండా ఫోన్‌లో మునిగిపోయాడు” అని కామెంట్ చేశారు.







