నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇటీవల పుష్ప 2 (Pushpa 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న రష్మిక మందన్న తిరిగి మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన ఛావా(Chhaava )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ విడుదల కాబోతుంది.
బాలీవుడ్ నటుడు విక్కి కౌశల్ రష్మిక (Vicky Kaushal, Rashmika)హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మిక తన జీవిత భాగస్వామి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రష్మిక తన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు.నాకు ఏదైనా పీస్ ప్లేస్ ఉంది అంటే అది నా ఇల్లేనని తెలిపారు.
![Telugu Chhaava, Rashmika, Vicky Kaushal-Movie Telugu Chhaava, Rashmika, Vicky Kaushal-Movie](https://telugustop.com/wp-content/uploads/2025/01/rashmika-mandanna-interesting-comments-on-her-life-partner-c.jpg)
నా ఇంట్లో నేనింతో సంతోషంగా ఉంటాను.నా సంతోషకరమైన ప్లేస్ ఏది అంటే వెంటనే ఇల్లు అని సమాధానం చెబుతాను.ఇంట్లో ఉన్నప్పుడు చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది ఎక్కడా లేని ఆనందం నాకు అక్కడ దొరుకుతుంది.ఎంతోమంది అభిమానుల ప్రేమను నేను పొందినప్పటికీ ఒక కుమార్తెగా, ఒక సోదరిగా ఒక భాగస్వామిగా నా జీవితాన్ని నేను గౌరవిస్తాను.
అది పూర్తిగా నా వ్యక్తిగత జీవితం అంటూ రష్మిక తెలిపారు.
![Telugu Chhaava, Rashmika, Vicky Kaushal-Movie Telugu Chhaava, Rashmika, Vicky Kaushal-Movie](https://telugustop.com/wp-content/uploads/2025/01/rashmika-mandanna-interesting-comments-on-her-life-partner-a.jpg)
ఇక ఎదుటివారిని మనస్తత్వం గురించి కూడా ఈమె మాట్లాడుతూ…కళ్ళు మన మనసుకు ప్రతిబింబాలు.కళ్ళతో పలికించే హావభావాలను నేను నమ్ముతాను ఎదుటి వారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే నేను ఇష్టపడతాను అంటూ ఈ సందర్భంగా రష్మికం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.రష్మిక గత కొంతకాలంగా నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ప్రేమలో ఉందన్న విషయం మనకు తెలిసింది ఇప్పటివరకు వీరి డేటింగ్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి కానీ ఎప్పుడు కూడా వీరి ప్రేమ విషయం అధికారకంగా ప్రకటించింది లేదు.