కెమెరాలో చిక్కిన సీక్రెట్ మూమెంట్.. మెలానియా ట్రంప్‌కు గవర్నర్ ముద్దు.. వీడియో వైరల్..

అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్‌ల ( Melania Trump , California Governor Gavin Newsom )మధ్య జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.గురువారం, మెలానియా, డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఎయిర్ ఫోర్స్ వన్‌లో కాలిఫోర్నియాకు చేరుకున్నారు.

 Melania Trump's Secret Moment Caught On Camera, Governor's Kiss Video Viral, Mel-TeluguStop.com

రాష్ట్రంలో కార్చిచ్చు బాధితులను పరామర్శించడానికి వారు వెళ్లారు.ట్రంప్ అధ్యక్షుడయ్యాక కాలిఫోర్నియాకు రావడం ఇదే తొలిసారి.

అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం వేరే సీన్.గవర్నర్ న్యూసమ్ దంపతులను స్వాగతిస్తుండగా, మెలానియా తన బుగ్గపై గవర్నర్ ముద్దును పుచ్చుకున్నారు.

ఈ ఘటన కెమెరాల్లో రికార్డ్ అయింది.అంతే, ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది.

ఆన్‌లైన్‌లో రకరకాల పుకార్లు షికార్లు చేయడం మొదలుపెట్టాయి.

కొందరు నెటిజన్లు ఈ సీన్‌ను ట్రంప్ ప్రమాణ స్వీకార సమయంలో మెలానియా ప్రవర్తనతో పోల్చడం మొదలుపెట్టారు.

అప్పుడు మెలానియా తన భర్త ముద్దును దాటవేసిందని విమర్శలు వచ్చాయి.తన పెద్ద టోపీని అడ్డుగా పెట్టుకుని ముద్దును తప్పించుకుందని చాలామంది కామెంట్ చేశారు.ఇక్కడ విశేషం ఏంటంటే, కాలిఫోర్నియా ( California )పర్యటనలో కూడా మెలానియా అలాంటి టోపీనే పెట్టుకుని కనిపించారు.కానీ, ఈసారి మాత్రం గవర్నర్ ముద్దుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు, చిరునవ్వుతో స్వీకరించారు.

ఈ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లకు దారి తీసింది.కొందరు మెలానియా, ట్రంప్‌తో కంటే న్యూసమ్‌తోనే చాలా సౌకర్యంగా ఉన్నారని కామెంట్ చేశారు.ఒక యూజర్ అయితే “మెలానియాకు గావిన్‌పై మనసు పడింది” అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.మరికొందరు మాత్రం ఆమె గవర్నర్‌ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించిన తీరును మెచ్చుకున్నారు.అయితే, మెలానియాను సమర్థిస్తూ చాలామంది కామెంట్లు పెట్టారు.ఆమె చర్యల్లో అసహజంగా ఏమీ లేదని అన్నారు.

ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమె టోపీ వల్లే ట్రంప్ ముద్దును తప్పించుకుని ఉండొచ్చని కొందరు వివరించారు.ఒక అభిమాని అయితే ట్రంప్ కూడా ఆమె మేకప్, ఔట్‌ఫిట్‌ను గౌరవించి ముద్దు పెట్టుకోలేదని సమర్థించాడు.

ప్రమాణ స్వీకార సమయంలో మెలానియా బిగుతుగా ఉండే నేవీ-బ్లూ కోటు, లెదర్ గ్లోవ్స్, స్టైలిష్ టోపీ ధరించారు.ఆ టోపీ వల్లనే ట్రంప్ ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డారని అంటారు.కానీ, కాలిఫోర్నియాలో మాత్రం ఆమె చాలా రిలాక్స్‌డ్‌గా కనిపించారు.అలాంటి టోపీ ఉన్నా, ముద్దు విషయంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు.ఏదేమైనా, ఈ వైరల్ మూమెంట్ మెలానియా పబ్లిక్ అపీరెన్స్‌లు, బాడీ లాంగ్వేజ్‌పై చర్చలను మళ్లీ తెరపైకి తెచ్చింది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube