రాజన్న సిరిసిల్ల జిల్లా : జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల- కళాశాల నర్మాలలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పి, లక్ష్మీరాజం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాలికల కోసం కాస్మోటిక్ చార్జీలు మెస్ ఛార్జీలు పెంచడం జరిగిందని వివరించారు.అలాగే ప్రతి హాస్టల్ కు స్పెషల్ ఆఫీసర్ను కేటాయించి ఆహారం మంచి నాణ్యమైన ఆహారం అందించేలాగా ఏర్పాట్లు కావించారు.
అలాగే అన్ని రకాల పాఠశాలలో ఒకే రకమైనటువంటి నూతన భోజన పట్టిక- డైట్ మెనూ ప్రకటించడం జరిగింది.పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విద్యార్థులకు నెయ్యి, చికెన్, మటన్ అలాగే వెజిటేబుల్ సంబంధించినటువంటి అంశాలలో వినూత్నమైన విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టడం జరిగింది.
దానికి అనుగుణంగా డైట్ చార్జీలను కూడా పెంచడం జరిగింది.అలాగే మహిళల భద్రత కోసం బాలికల భద్రత కోసం నిరంతరం షీ టీంలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు లు పనిచేస్తున్నాయి.
అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు సహా బాలికలు మహిళల సంరక్షణ కోసం అనేక పథకాలు ప్రకటించడం జరిగింది.వాటిలో గృహజ్యోతి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు ఇలా ప్రతి పథకంలో మహిళా భాగస్వామ్యానికి పెద్దపీట వేయడం జరుగుతుందని వివరించారు.
అలాగే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తూ వాటన్నింటిలో ఉపాధ్యాయుల నియామకం చేపట్టడం జరిగింది.అలాగే ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఇలా మహిళలకు పిల్లలకు అభ్యున్నతి కోసం అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది అని వివరించారు.అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున బాలికల కోసం బేటి బచావో బేటి పడావో, సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాలు లింగ వివక్షతను అరికట్టడానికి మహిళల సాధికారికత పెంపొందించడానికి కృషి చేయడం జరుగుతున్నది.
అలాగే రాజ్యాంగం ద్వారా మహిళలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులు వివిధ చట్టాల ద్వారా మహిళల కోసం తీసుకున్న ప్రత్యేక చట్టాలు మహిళల కోసం ఉన్న ప్రత్యేక పథకాలను విద్యార్థులకు వివరించడం జరిగింది.బాలికలు మహిళలకి ఆపద సమాయాల్లో 24 గంటలు ఉచితంగా మహిళా శిశు సంక్షేమ శాఖ టోల్ ఫ్రీ నెంబర్స్ అయినా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181 తక్షణమే సహాయాన్ని అందిస్తాయని తెలిపారు.
తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థినిలకు బహుమతులు అందించడం జరిగింది.అలాగే ఎందరో మహిళలు ఆదర్శవంతంగా అనేకమైనటువంటి రంగాలలో కృషిచేసి సమాజం యొక్క అభ్యున్నతికి తోడ్పడుతున్నారని మహిళల సేవలను కొనియాడారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ బాలికలను చదివించాలి బాలికలను రక్షించాలి అనే నినాదంతో ప్రతి ఇంటి నుండి మార్పు మొదలుకావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఉమారాణి,ప్రిన్సిపల్ సృజన, డిహబ్ కోఆర్డినేటర్ రోజా, సిబ్బంది దేవిక,రమ్య, సఖి సిబ్బంది, ఐసిడిఎస్ సూపర్వైజర్ రేణుక, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.







