తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి చాలామంది స్టార్ హీరో గుర్తుకొస్తారు.ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలను థియేటర్లో చూసిన ప్రేక్షకులు వాళ్ళను మాత్రమే హీరోలుగా భావిస్తూ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ముందుకు సాగుతుంటారు.
మరి ఇదిలా ఉంటే ఒక సినిమాని తీసేది అలాగే హీరో ఎలా యాక్టింగ్ చేయాలి అని చెప్పేది దర్శకుడే…కానీ సినిమా సక్సెస్ లో పేరు హీరోకి మాత్రం వస్తుంది.మరి ఎందుకు ఇలా చేస్తున్నారు.
ఎందుకని దర్శకులను గుర్తించడం లేదు అంటూ వాదించేవారు కూడా ఉన్నారు.ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమా సక్సెస్ అనేది అందరికి మంచి గుర్తింపునైతే తీసుకు వస్తుంది.
ఇక మొదట సినిమాటోగ్రాఫర్( Cinematographer ) గా ఉన్నా తేజ( Teja ) ఆ తర్వాత డైరెక్టర్ అవ్వలనుకున్నాడు.ఇక చిత్రం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.అయితే ఈ సినిమా విషయంలో ఆయన చాలా మంచి స్క్రిప్ట్ ని రాసుకొని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు.కొంతమంది ఆయనకు సినిమా తీయరాదు అంటూ అతని మీద కొన్ని అభియోగాలు కూడా మోపినట్లు ఆయన ఒకానొక సందర్భంలో తెలియజేశాడు.
కానీ రామోజీరావు( Ramoji Rao ) తన మీద పెట్టుకుని నమ్మకాన్ని నిలబెడుతూ చిత్రం సినిమాని 40 లక్షలు తీసి 5 కోట్ల ప్రాఫిట్ ని తీసుకొచ్చానని చెబుతూ ఉంటాడు.మొత్తానికైతే ‘చిత్రం’ సినిమాతో( Chitram ) ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.
మరి ఏది ఏమైనా కూడా కథను నమ్ముకొని ముందుకెళ్లినప్పుడు అతన్ని హేళన చేయడం అనేది చాలా తప్పు మాట.
ఆయన ఒక విజన్ తో పని చేసినప్పుడు సినిమాని ఎలా సక్సెస్ చేయాలో అతనికి మాత్రమే తెలుసు అంటూ తేజ చాలా సందర్భాల్లో చెప్పాడు.ఇక తనని చిన్నచూపు చూసిన వారు ఎవరు అనే విషయాన్ని ఆయన ఎక్కడ చెప్పలేదు.కానీ ఇన్ డైరెక్టుగా వాళ్లకు కౌంటర్స్ అయితే వేస్తూ ఉంటాడు.
మరి ఏది ఏమైనా ఇప్పుడు తేజ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది.ఎందుకంటే ప్రస్తుతానికి వరుసగా ఫ్లాప్ లైతే వస్తున్నాయి.
కాబట్టి ఒక హిట్ సినిమా తీయాల్సి ఉందనేది వాస్తవం…
.