ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం.6.06
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు
దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34
మేషం:
ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు.స్వస్థానమున ధన ప్రాప్తి కలుగుతుంది.
కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు.అనారోగ్య సమస్యల నుంచి ఉపసమనం లభిస్తుంది.వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది.
వృషభం:
ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఇంటా బయట చికాకులు మరింత పెరుగుతాయి.ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది.ఆరోగ్యం సహకరించక ఇబ్బంది కలిగిస్తుంది.
వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు అదనపు వివరాలు పనిభారం తప్పదు.
మిథునం:
ఈరోజు సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ప్రయాణాలలో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
కర్కాటకం:
ఈరోజు దూరప్రయాణాలు వాయిదా పడతాయి.చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగడం మంచిది కాదు.ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి.ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి.
సింహం:
ఈరోజు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు.వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం అందిస్తారు.చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కన్య:
ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.దూర ప్రయాణాలలో మార్గాలు అవరోధాలు కలుగుతాయి.పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు.
మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల:
ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.దూర ప్రయాణాలలో మార్గాలు అవరోధాలు కలుగుతాయి.పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు.మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు అనుకూలంగా ఉంది.
ధనుస్సు:
ఈరోజు వృత్తి వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు.నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.
మకరం:
ఈరోజు వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి.ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి.ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి.
మొండి బకాయిలు వసూలవుతాయి.బంధు మిత్రుల ఆదరణ పొందుతారు.ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
కుంభం:
ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు.ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి.
మీనం:
ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి.సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి.దూరపు బంధువుల నుండి కొంత కీలక సమాచారం సేకరిస్తారు.ఉద్యోగమున విధులు సమర్ధవంతంగా నిర్వహించి.అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.